Friday, 16 October 2026

పేద‌ల ఆక‌లి తీరుస్తున్న అన్న క్యాంటీన్

newsseals-AnnaCanteen

ప్రారంభించిన సీఎం చంద్ర‌బాబు నాయుడు

అమ‌రావ‌తి : అన్న క్యాంటీన్లు పేద‌ల ఆక‌లిని తీరుస్తున్నాయ‌ని అన్నారు సీఎం చంద్ర‌బాబు నాయుడు.
పెదకూరపాడు నియోజకవర్గం ధరణికోటలో కార్మికులతో కలిసి అన్న క్యాంటీన్‌ను ప్రారంభించి ప్ర‌సంగించారు. అన్న క్యాంటీన్ ప్రారంభం అనంతరం పేదలకు స్వయంగా భోజనం వడ్డించారు. లబ్ధిదారులతో మాట్లాడుతూ అన్న క్యాంటీన్‌లోనే భోజనం చేశారు సీఎం. ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు మంత్రి గొట్టిపాటి రవికుమార్, ఎంపీ శ్రీకృష్ణదేవ రాయలు, స్థానిక ఎమ్మెల్యే భాష్యం ప్రవీణ్. 2024లో కూటమి అధికారంలోకి వచ్చాక రాష్ట్రంలో 207 అన్న క్యాంటీన్లు ఏర్పాటు చేసింది స‌ర్కార్.

ఇవాళ గ్రామీణ ప్రాంతాల్లో మరో 62 అన్న కాంటీన్లను ప్రారంభించింది రాష్ట్ర ప్రభుత్వం . మొత్తంగా రాష్ట్రంలో 269 పెరిగిన అన్న క్యాంటీన్ల సంఖ్య. త్వరలో మరో 5 అన్న క్యాంటీన్లను ప్రారంభించాలని నిర్ణయించామ‌న్నారు సీఎం నారా చంద్ర‌బాబు నాయుడు. గడచిన 21 నెలల్లో 8.80 కోట్ల భోజనాలను పేదలకు అందించ‌డం జ‌రిగింద‌న్నారు. ప్రతీ రోజూ ఒక్కో అన్న క్యాంటీన్ లో సగటున 1013 మందికి భోజన సదుపాయం క‌లిగింద‌న్నారు. రాష్ట్ర వ్యాప్తంగా అన్న క్యాంటీన్లలో పేదలకు భోజన వసతి కోసం రూ.243 కోట్లు వెచ్చించింద‌న్నారు సీఎం.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *