Saturday, 17 October 2026

విద్యార్హ‌త‌పై బీహార్ సీఎం షాకింగ్ కామెంట్స్

newsseals-BiharCM

సోష‌ల్ మీడియాలో సామ్రాట్ చౌద‌రి వైర‌ల్

బీహార్ : బీహార్ సీఎంగా కొలువు తీరిన సామ్రాట్ చౌద‌రి సంచ‌ల‌నంగా మారారు. ఓ టీవీ ఛాన‌ల్ నిర్వ‌హించిన చిట్ చాట్ సంద‌ర్బంగా ఎర‌క్క పోయి ఇరుక్కు పోయారు. త‌ను ఏం చదువుకున్నార‌ని యాంక‌ర్ ప‌దే ప‌దే ప్ర‌శ్నించింది. కానీ ఆయ‌న కూల్ గా స‌మాధానం చెప్పాల్సింది పోయి విచిత్రంగా స‌మాధానం ఇచ్చారు. ప్ర‌స్తుతం బీహార్ రాష్ట్రానికి కొత్త‌గా ముఖ్య‌మంత్రిగా కొలువు తీరారు. 10వ తరగతి పాస్ అయ్యారా అని అడిగితే.. దానికి జవాబు చెప్పకుండా PFC చేశానంటూ మాట మార్చే ప్రయత్నం చేశారు.

నేను కామరాజ్ యూనివర్సిటీ నుంచి పీఎఫ్‌సీ చేశాన‌ని చెప్పారు సామ్రాట్ చౌద‌రి. కావాలంటే అక్కడికే వెళ్లి చెక్ చేసుకోండి, నా హఫిడవిట్ (అఫిడవిట్ కి సామ్రాట్ ఇచ్చిన కొత్త పేరు) లో కూడా ఉందన్నారు సీఎం. అదంతా సరే.. అసలు మీరు 10వ తరగతి పాస్ అయ్యారా? మీరు ఇచ్చిన అఫిడవిట్ లో కేవలం 7వ తరగతి పాస్ అయినట్టు పేర్కొన్నారంటూ వెల్ల‌డించారు. నేను చెప్పాల్సింది చెప్పా.. మీరు యూనివర్సిటీకి వెళ్లి చెక్ చేసుకోండి అంటూ పేర్కొన్నారు. ఇక సామ్రాట్ చౌద‌రి రాజ‌కీయ ప్ర‌స్థానం ఎత్తుప‌ల్లాల‌తో నిండి పోయింది.

మూడు దశాబ్దాల క్రితం బీహార్‌లో మంత్రిగా తన రాజకీయ జీవితాన్ని ప్రారంభించిన ఆయన, తన అర్హతకు సంబంధించి వచ్చిన ఆరోపణల కారణంగా అప్పటి గవర్నర్ చేత పదవి నుండి తొలగించబడ్డారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *