కాంగ్రెస్, డీఎంకే కుటుంబ పార్టీలు

VijayaBhaskar · April 20, 2026
Spread the love

మంత్రి సత్యకుమార్ షాకింగ్ కామెంట్స్

విజ‌య‌వాడ : ఏపీ రాష్ట్ర వైద్య‌, ఆరోగ్య శాఖ మంత్రి స‌త్య కుమార్ యాద‌వ్ సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేశారు. ఆయ‌న త‌మిళ‌నాడులో ప్ర‌స్తుతం జ‌రుగుతున్న శాస‌న స‌భ ఎన్నిక‌ల‌పై స్పందించారు. రాష్ట్రంలోని కాంగ్రెస్ డీఎంకే పార్టీలు కుటుంబ పార్టీల‌ని పేర్కొన్నారు. ఆ రెండు పార్టీల‌ను ప్ర‌జ‌లు న‌మ్మ‌డం లేద‌న్నారు. అందుకే దేశంలో, ఆయా రాష్ట్రాల‌లో ఎప్పుడు ఎన్నిక‌లు వ‌చ్చినా జ‌నం ఛీ కొడుతున్నార‌ని పేర్కొన్నారు. ప్ర‌జ‌లు సుస్థిర‌మైన పాల‌న‌ను అందిస్తార‌ని పేర్కొన్నారు. ఆచ‌ర‌ణ‌కు నోచుకోని హామీలు ఇ చ్చే పార్టీల‌ను ఆద‌రించ‌ర‌ని ఆ విష‌యం తెలుసుకుంటే మంచిద‌ని హిత‌వు ప‌లికారు.

కేంద్ర ప్ర‌భుత్వం ప్ర‌తిష్టాత్మ‌కంగా తీసుకు వ‌చ్చిన డీ లిమిటేష‌న్ , మ‌హిళా బిల్లుల‌ను అడ్డుకోవ‌డం విడ్డూరంగా ఉంద‌న్నారు. ఇది పూర్తిగా అప్ర‌జాస్వామిక‌మ‌ని పేర్కొన్నారు. తర్వాతి తరాన్ని ప్రోత్సహిస్తున్న అన్ని పార్టీలు మహిళా బిల్లు, డీలిమిటేషన్ బిల్లును వ్యతిరేకిస్తుండ‌డం దారుణమ‌న్నారు స‌త్య‌కుమార్ యాద‌వ్. తద్వారా మానసిక ఆనందం పొందుతున్నారే తప్ప మ‌హిళ‌ల‌ను దూరం పెడుతున్నామ‌న్న సోయి లేకుండా వ్య‌వ‌హ‌రిస్తే ఎలా అని ప్ర‌శ్నించారు.