బీజేపీపై భ‌గ్గుమ‌న్న క‌డియం శ్రీ‌హ‌రి

తెలంగాణ‌పై అడుగ‌డుగునా అవమానం

హైద‌రాబాద్ : స్టేష‌న్ ఘ‌న‌పూర్ ఎమ్మెల్యే క‌డియం శ్రీ‌హ‌రి సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేశారు. ఆయ‌న బార‌తీయ జ‌న‌తా పార్టీని ఏకి పారేశారు. ఆ పార్టీ నేత‌లు ఏం మాట్లాడుతున్నారో వారికే అర్థం కావ‌డం లేద‌న్నారు. వారికి తెలంగాణ రాష్ట్రం రావ‌డం ఇష్టం లేద‌న్నారు. మతం పేరుతో, కులం పేరుతో రాజ‌కీయాలు చేసే వారికి ఈ ప్రాంత‌పు ఆత్మ గౌర‌వం ఎలా అర్థం అవుతుంద‌ని ప్ర‌శ్నించారు. చిల్ల‌ర రాజ‌కీయాలు చేయ‌డం మానుకోవాల‌ని హిత‌వు ప‌లికారు.

పార్ల‌మెంట్ సాక్షిగా క‌ర్ణాట‌క‌కు చెందిన బీజేపీ ఎంపీ తేజ‌స్వి సూర్య తెలంగాణ రాష్ట్రం విభ‌జ‌న గురించి ప్ర‌స్తావించడాన్ని త‌ప్పు ప‌ట్టారు. ఇది పూర్తిగా అప్రజాస్వామిక‌ని పేర్కొన్నారు. త‌మ స్వ‌లాభం కోసం చిల్ల‌ర మాట‌లు మాట్లాడే వారిని తెలంగాణ స‌మాజం స‌హించ‌ద‌ని హెచ్చ‌రించారు. బీజేపీ తెలంగాణ ఏర్పాటును అడుగడుగునా అవమానిస్తూ వ‌స్తోంద‌ని ఆరోపించారు. మహిళా బిల్లుకు డిలీమిటేషన్ బిల్లును లింక్ చేసి పాస్ చేయించు కోవాలని బీజేపీ ప‌న్నిన కుట్ర బ‌ట్ట బ‌య‌లు అయ్యింద‌న్నారు. ఏ విషయంలో నైనా బీజేపీ రాజకీయ ప్రయోజనాల కోసమే ప‌ని చేస్తుందని వెల్ల‌డైంద‌న్నారు క‌డియం శ్రీ‌హ‌రి.

  • Related Posts

    రాబోయే భ‌విష్య‌త్తును నిర్దేశించేది ఏఐనే

    చెన్నై : : ‘దేశమే ప్రథమం’ అనే సూత్రానికి కట్టుబడి, తమ జ్ఞానం, ఆవిష్కరణలు , నైపుణ్యాలను దేశ నిర్మాణానికి వినియోగించాలని ఉప రాష్ట్రపతి సి.పి. రాధాకృష్ణన్ పట్టభద్రులను కోరారు. చెన్నై సమీపంలోని కట్టంకుళత్తూరులో ఉన్న ఎస్.ఆర్.ఎం. ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ సైన్స్…

    తెలంగాణ ‘సేఫ్’ డైర‌క్ట‌ర్ గా అవినాష్ మొహంతి

    హైద‌రాబాద్ : తెలంగాణ ప్ర‌భుత్వం కీల‌క నిర్ణ‌యం తీసుకుంది. ఇప్ప‌టికే స‌మ‌ర్థ‌వంత‌మైన పోలీస్ ఆఫీస‌ర్ గా గుర్తింపు పొందారు అవినాష్ మొహంతి. ఆయ‌న‌కు కీల‌క ప‌ద‌వి క‌ట్ట‌బెట్టింది . సేఫ్ డైరెక్ట‌ర్ గా నియ‌మించింది. గతంలో తెలంగాణ డ్రగ్స్ కంట్రోల్ అడ్మినిస్ట్రేషన్…

    Leave a Reply

    Your email address will not be published. Required fields are marked *