Friday, 16 October 2026

గంగపుత్ర, బెస్త కులాలకు న్యాయం చేస్తాం

newsseals-BCCommission

బీసీ కమిషన్ చైర్మన్ జి.నిరంజన్

హైదరాబాద్ : తెలంగాణ రాష్ట్రంలో అత్యధికంగా ఉన్న గంగపుత్ర , బెస్త, గూండ్ల కులస్తులకు బిసి స్థితిగతుల అధ్యయనం కోసం జరిగే జన గణలో వారికి తగిన న్యాయం చేస్తుందని రాష్ట్ర వెనుకబడిన తరగతుల చైర్మన్ జి.నిరంజన్ హామీ ఇచ్చారు. తమ దృష్టికి తెచ్చిన న్యాయమైన మీసమస్యలను కమిషన్ సభ్యులు రాష్ట్ర ప్రభుత్వం దృష్టికి తీసుకువచ్చి పరిష్కరిస్తామని ఆయన చెప్పారు. ఆంధ్రప్రదేశ్ చెందిన అగ్నికుల క్షత్రియ ఉపకులాలు జాబితాలో గంగపుత్ర, బెస్తల lను చూపించడం సమంజసంగా లేదని ముషీరాబాద్ శాసన సభ్యులు ముఠాగోపాల్ నాయకత్వంలో పలు బెస్త, గంగపుత్ర, గూండ్ల సంఘాల ప్రతినిధులు ఖైరతాబాద్ లోని బీసీ కమిషన్ కార్యాలయంలో తెలంగాణ రాష్ట్ర బీసీ కమిషన్ చైర్మన్ జి .నిరంజన్ ను ప్రతినిధులు కలిసి వినతి పత్రాన్ని అందజేయడం జరిగింది.

ఈ సందర్భంగా ఎమ్మెల్యే మూఠ గోపాల్ మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రంలో అత్యధిక జనాభా ఉన్న గంగపుత్రులు, బెస్తల, గూండ్ల జనాభా సంఖ్య అతి తక్కువ సంఖ్య చూపించడం శోచనీయమన్నారు. చేపలు వృత్తి సాంప్రదాయంగా వస్తున్న గంగపుత్ర, బెస్త, గూండ్ల సింబల్ ఖడ్గం తల్వార్ గుర్తించడం ఎంతవరకు సమంజసమని ఆయన ప్రశ్నించారు. ముదిరాజులకు చాపగుర్తును కేటాయించడాన్ని ఆయన తప్పు పడుతూ బిసి కమిషన్ దృష్టికి తీసుకు వచ్చారు. ఈ కార్యక్రమంలో బీసీ కమిషనర్లు రాపోలు జయప్రకాష్, ఆర్.బాల లక్ష్మి, రాష్ట్ర గంగపుత్ర సంఘాల ప్రతినిధులు ఆర్.కె.ప్రసాద్, ప్రొఫెసర్ సుదర్శన్, దీటి రామచందర్, అడ్వకేట్ మల్లేశం, చర్క సత్యనారాయణ, కాయ హనుమంతు, బి. లక్ష్మయ్య, సురేష్ తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *