Saturday, 17 October 2026

క‌విత టీఆర్ఎస్ పార్టీపై బీఆర్ఎస్ కామెంట్స్

newsseals-BRSSams

అస‌లు పార్టీ త‌మ‌దే… త‌న పార్టీని న‌మ్మ‌రు

హైద‌రాబాద్ : తెలంగాణ రాష్ట్ర స‌మితి పార్టీ పేరును బార‌త రాష్ట్ర స‌మితి పార్టీగా మార్చిన కేసీఆర్ పై అనుచిత వ్యాఖ్య‌లు చేశారు స్వంత కూతురు క‌ల్వ‌కుంట్ల క‌విత‌. శ‌నివారం మేడ్చ‌ల్ జిల్లాలో జ‌రిగిన స‌భ‌లో ఆమె కొత్త పార్టీని ప్ర‌క‌టించారు. దాని పేరు తెలంగాణ రాష్ట్ర సేన (టీఆర్ఎస్) గా పెట్టారు. దీనిపై తీవ్రంగా స్పందించింది బీఆర్ఎస్ పార్టీ. ఎక్స్ వేదిక‌గా కీల‌క వ్యాఖ్య‌లు చేసింది. అసలైనది ఎప్పుడూ అసలైనదే అని పేర్కొంది. మేడ్చల్ జిల్లాలోని మునిరాబాద్‌లో గల ఒక కన్వెన్షన్ సెంటర్‌లో మాజీ MLC కె. కవిత కొత్త పార్టీని ప్రారంభించడాన్ని పరోక్షంగా ప్రస్తావించింది.

ఆమె తన కొత్త పార్టీకి ‘తెలంగాణ రాష్ట్ర సేన’ (TRS) అని పేరు పెట్టారు. కవిత తన పార్టీ పేరును TRSగా ప్రకటించిన వెంటనే, BRS తన ‘X’ ఖాతాలో స్పందిస్తూ—టూత్‌పేస్ట్ , వాటర్ బాటిల్‌కు సంబంధించిన రెండు ప్రముఖ బ్రాండ్ల అసలైన, నకిలీ ఉత్పత్తుల మధ్య తేడాలను చూపే ఛాయా చిత్రాలను జతచేసింది. అసలైనది ఎప్పుడూ అసలైనదేనని పేర్కొంది. జ‌నం త‌నను ఆద‌రించ‌ర‌ని, త‌న‌ను ఎట్టి ప‌రిస్థితుల్లో న‌మ్మ‌రంటూ స్ప‌ష్టం చేసింది. ఈ సంద‌ర్భంగా కాంగ్రెస్ పార్టీ వ్యంగ్యంగా స్పందించింది. బీఆర్ఎస్ కు ఆ పార్టీ తోక పార్టీ అంటూ పేర్కొంది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *