అభిషేక్ శ‌ర్మ బ్యాటింగ్ అదుర్స్

Spread the love

స‌న్ రైజ‌ర్స్ సూప‌ర్ విక్ట‌రీతో షాక్

జైపూర్ : కావ్య మార‌న్ సంతోషానికి అవ‌ధులు లేకుండా పోయింది. కార‌ణం త‌మ జ‌ట్టు వ‌రుస విజ‌యాలు సాధిస్తూ వ‌స్తోంది. తాజాగా జ‌రుగుతున్న ఐపీఎల్ 19వ సీజ‌న్ లో ప్ర‌త్య‌ర్థి జ‌ట్ల‌కు ఝ‌ల‌క్ ఇస్తోంది. ప్ర‌ధానంగా కెప్టెన్ ఇషాన్ కిష‌న్, ఓపెన‌ర్ అభిషేక్ శ‌ర్మ‌లు సూప‌ర్ ఫామ్ తో ఆక‌ట్టుకుంటున్నారు. బౌల‌ర్ల భ‌ర‌తం ప‌డుతున్నారు. తాజాగా జ‌రిగిన కీల‌క లీగ్ పోటీలో ఆతిథ్య రాజ‌స్థాన్ రాయ‌ల్స్ జ‌ట్టుకు కోలుకోలేని షాక్ ఇచ్చారు. మ‌రోసారి యంగ్ క్రికెట‌ర్, ఓపెన‌ర్ అభిషేక్ శ‌ర్మ త‌న‌దైన శైలిలో ఆడాడు. హాఫ్ సెంచ‌రీతో క‌దం తొక్కాడు. రాజ‌స్తాన్ బౌల‌ర్ల‌కు చుక్క‌లు చూపించాడు.

ఓపెన‌ర్ అభిషేక్ శ‌ర్మ‌తో క‌లిసి ఇషాన్ కిష‌న్ చెల‌రేగి ఆడాడు. ఈ ఇద్ద‌రు బౌల‌ర్లు రాజ‌స్తాన్ బౌల‌ర్ల‌ను ఉతికి ఆరేశారు. ఇషాన్ కిష‌న్ 31 బంతుల్లో 74 ర‌న్స్ చేశాడు. ఇందులో 11 ఫోర్లు 3 సిక్సులు ఉన్నాయి. అభిషేక్ శ‌ర్మ 57 29 బాల్స్ ఎదుర్కొని 57 ర‌న్స్ చేశాడు. 11 ఫోర్లు ఒక సిక్స్ ఉంది. ఈ ఇద్ద‌రూ క‌లిసి తొలి వికెట్ భాగ‌స్వామ్యానికి 132 ప‌రుగులు జోడించారు. నితీశ్ కుమార్ 36 ర‌న్స్ చేస్తే క్లాసెన్ 29 ప‌రుగులు చేశారు. రాజ‌స్తాన్ బౌల‌ర్ల‌లో బ్రిజేష్ 44 ర‌న్స్ ఇచ్చి 2 వికెట్లు కూల్చితే ఆర్చ‌ర్ 34 ప‌రుగులు ఇచ్చి 2 వికెట్లు తీశాడు.

  • Related Posts

    చెల‌రేగిన ఇషాన్ రాజ‌స్తాన్ ప‌రేషాన్

    Spread the love

    Spread the love5 వికెట్ల తేడాతో వ‌రుస విజ‌యం జైపూర్ : ఐపీఎల్ 2026లో కావ్య మార‌న్ మేనేజ్మెంట్ కు చెందిన స‌న్ రైజ‌ర్స్ జ‌ట్టు ఊహించ‌ని రీతిలో దుమ్ము రేపుతోంది. విజ‌యాల ప‌రంప‌ర కొన‌సాగిస్తోంది. పాయింట్ల ప‌ట్టిక‌లో దూసుకు పోయింది.…

    సాయి సుద‌ర్శ‌న్ షాన్ దార్ సెంచ‌రీ

    Spread the love

    Spread the loveసెంచ‌రీతో క‌దం తొక్కిన బ్యాట‌ర్ బెంగ‌ళూరు : ఐపీఎల్ 2026లో మ‌రోసారి స‌త్తా చాటాడు గుజ‌రాత్ టైటాన్స్ జ‌ట్టుకు చెందిన ప్లేయ‌ర్ సాయి సుద‌ర్శ‌న్. ప్ర‌తి సీజ‌న్ లో త‌న‌దైన శైలితో ఆడుతూ వ‌స్తున్నాడు. తాజాగా బెంగ‌ళూరులోని చిన్న‌స్వామి…

    Leave a Reply

    Your email address will not be published. Required fields are marked *