newsseals.com
SPORTS

చెల‌రేగిన ఇషాన్ రాజ‌స్తాన్ ప‌రేషాన్

VijayaBhaskar April 26, 2026
newsseals-IshanKsihan
Spread the love

5 వికెట్ల తేడాతో వ‌రుస విజ‌యం

జైపూర్ : ఐపీఎల్ 2026లో కావ్య మార‌న్ మేనేజ్మెంట్ కు చెందిన స‌న్ రైజ‌ర్స్ జ‌ట్టు ఊహించ‌ని రీతిలో దుమ్ము రేపుతోంది. విజ‌యాల ప‌రంప‌ర కొన‌సాగిస్తోంది. పాయింట్ల ప‌ట్టిక‌లో దూసుకు పోయింది. ఇంకో వైపు ఆతిథ్య జ‌ట్టు రాజ‌స్థాన్ రాయ‌ల్స్ కు చుక్క‌లు చూపించింది హైద‌రాబాద్ . ముందుగా బ్యాటింగ్ కు దిగిన రాజ‌స్తాన్ రాయ‌ల్స్ నిర్దేశించిన ల‌క్ష్యాన్ని అల‌వోకగా చేదించింది. ప్ర‌ధానంగా కెప్టెన్ ఇషాన్ కిష‌న్ బాధ్య‌తాయుత‌మైన ఇన్నింగ్స్ తో ఆక‌ట్టుకున్నాడు. ఓపెన‌ర్ ట్రావిస్ హెడ్ మ‌రోసారి విఫ‌లం అయ్యాడు. అనంత‌రం మైదానంలోకి వ‌చ్చిన కిష‌న్ దూకుడు పెంచాడు.

ఓపెన‌ర్ అభిషేక్ శ‌ర్మ‌తో క‌లిసి ఇషాన్ కిష‌న్ చెల‌రేగి ఆడాడు. ఈ ఇద్ద‌రు బౌల‌ర్లు రాజ‌స్తాన్ బౌల‌ర్ల‌ను ఉతికి ఆరేశారు. ఇషాన్ కిష‌న్ 31 బంతుల్లో 74 ర‌న్స్ చేశాడు. ఇందులో 11 ఫోర్లు 3 సిక్సులు ఉన్నాయి. అభిషేక్ శ‌ర్మ 57 29 బాల్స్ ఎదుర్కొని 57 ర‌న్స్ చేశాడు. 11 ఫోర్లు ఒక సిక్స్ ఉంది. ఈ ఇద్ద‌రూ క‌లిసి తొలి వికెట్ భాగ‌స్వామ్యానికి 132 ప‌రుగులు జోడించారు. నితీశ్ కుమార్ 36 ర‌న్స్ చేస్తే క్లాసెన్ 29 ప‌రుగులు చేశారు. రాజ‌స్తాన్ బౌల‌ర్ల‌లో బ్రిజేష్ 44 ర‌న్స్ ఇచ్చి 2 వికెట్లు కూల్చితే ఆర్చ‌ర్ 34 ప‌రుగులు ఇచ్చి 2 వికెట్లు తీశాడు.