సెంచరీతో కదం తొక్కిన బ్యాటర్
బెంగళూరు : ఐపీఎల్ 2026లో మరోసారి సత్తా చాటాడు గుజరాత్ టైటాన్స్ జట్టుకు చెందిన ప్లేయర్ సాయి సుదర్శన్. ప్రతి సీజన్ లో తనదైన శైలితో ఆడుతూ వస్తున్నాడు. తాజాగా బెంగళూరులోని చిన్నస్వామి స్టేడియం వేదికగా జరిగిన కీలక లీగ్ మ్యాచ్ లో అద్భుతమైన సెంచరీతో ఆకట్టుకున్నాడు. కానీ తన జట్టు ఓడి పోయింది. మ్యాచ్ లో భాగంగా ముందుగా బరిలోకి దిగిన గుజరాత్ టైటాన్స్ నిర్ణీత 20 ఓవర్లలో 3 వికెట్లు కో ల్పోయి 205 రన్స్ చేసింది. సాయి సుదర్శన్ 58 బంతులు ఎదుర్కొని 100 రన్స్ చేశాడు. ఇందులో 11 ఫోర్లు 5 సిక్సులు ఉన్నాయి.
అనంతరం 206 పరుగుల లక్ష్యతో బరిలోకి దిగిన ఆర్సీబీ బ్యాటర్లు రెచ్చి పోయి ఆడారు. రన్ మెషీన్ విరాట్ కోహ్లీ సూపర్ షో చేశాడు. తను కంటిన్యూగా ఫుల్ ఫామ్ కొనసాగిస్తూ వస్తున్నాడు. తనకు అచ్చొచ్చిన మైదానంలో రెచ్చి పోయాడు. కళ్లు చెదిరే షాట్స్ తో అలరించాడు. ఐపీఎల్ లో 300 ఫోర్లు కొట్టాడు విరాట్ కోహ్లీ. కేవలం 44 బంతులు ఎదుర్కొని 81 రన్స్ చేశాడు. 8 ఫోర్లు 4 సిక్సులు కొట్టాడు. దేవదత్ పడిక్కల్ 27 బాల్స్ ఎదుర్కొని 55 రన్స్ చేశాడు. ఇందులో 2 ఫోర్లు 6 సిక్స్ లు ఉన్నాయి. ఈ ఓటమితో గుజరాత్ టైటాన్స్ 7వ స్థానానికి పడి పోయింది. మొత్తంగా సాయి సుదర్శన్ పడిన కష్టం వృధా అయ్యింది.






