చ‌ర్చ‌లు స‌ఫ‌లం ఆర్టీసీ కార్మికులు సంతోషం

మంత్రి పొన్నం ప్ర‌భాక‌ర్ గౌడ్ కు ఘ‌న స‌న్మానం

హైద‌రాబాద్ : తెలంగాణ ఆర్టీసీ కార్మికుల ఆందోళ‌న దెబ్బ‌కు రేవంత్ రెడ్డి స‌ర్కార్ ఎట్ట‌కేల‌కు దిగి వ‌చ్చింది. వారు ముందు ఉంచిన 32 డిమాండ్లను ఒప్పుకుంది. గ‌త్యంత‌రం లేక క‌మిటీ కూడా ఏర్పాటు చేసింది. ఈ కీల‌క నిర్ణ‌యం తీసుకున్నందుకు నిన్న అర్ధ‌రాత్రి నుంచే స‌మ్మెను విర‌మిస్తున్న‌ట్లు ప్ర‌క‌టించారు ఆర్టీసీ జేఏసీ నేత‌లు. ఇదిలా ఉండ‌గా ఆర్టీసీ కార్మికుల సమస్యలు పరిష్కరించేలా ప్రభుత్వం చర్చలు చరిత్రాత్మక నిర్ణయం తీసుకున్న నేపథ్యంలో ఆదివారం మినిస్టర్ క్వార్టర్స్ లో రాష్ట్ర రోడ్డు ర‌వాణా శాఖ మంత్రి పొన్నం ప్ర‌భాక‌ర్ గౌడ్ కు ధ‌న్య‌వాదాలు తెలిపారు. ఆయ‌న‌కు శాలువా క‌ప్పి స‌న్మానించారు.

ప్రభుత్వం ఆర్టీసీ కార్మికుల చిరకాల స్వప్నం నెరవేర్చడంతో ఆర్టీసీ ప్రభుత్వంలో విలీనం.. కార్మికులకు గుర్తింపు సంఘాల ఎన్నికల నిర్వహణ ,ఆర్టీసీ కార్మికులకు 11 శాతం పీఆర్సీ ప్రకటించడంతో హర్షం వ్యక్తం చేశారు జేఏసీ నేత‌లు వెంకన్న, థామస్ రెడ్డి, అశ్వద్ధామ రెడ్డి,హనుమంతు ముదిరాజ్ ,ఇతర సంఘాల నేతలు. ప్రభుత్వం తీసుకున్న చారిత్రాత్మక నిర్ణయం తో ప్రజా రవాణా ను మరింత బలపరిచేలా ఉత్సాహం తో కార్మికులు పని చేయాలని సూచించారు మంత్రి పొన్నం ప్ర‌భాక‌ర్ గౌడ్.

  • Related Posts

    రాబోయే భ‌విష్య‌త్తును నిర్దేశించేది ఏఐనే

    చెన్నై : : ‘దేశమే ప్రథమం’ అనే సూత్రానికి కట్టుబడి, తమ జ్ఞానం, ఆవిష్కరణలు , నైపుణ్యాలను దేశ నిర్మాణానికి వినియోగించాలని ఉప రాష్ట్రపతి సి.పి. రాధాకృష్ణన్ పట్టభద్రులను కోరారు. చెన్నై సమీపంలోని కట్టంకుళత్తూరులో ఉన్న ఎస్.ఆర్.ఎం. ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ సైన్స్…

    తెలంగాణ ‘సేఫ్’ డైర‌క్ట‌ర్ గా అవినాష్ మొహంతి

    హైద‌రాబాద్ : తెలంగాణ ప్ర‌భుత్వం కీల‌క నిర్ణ‌యం తీసుకుంది. ఇప్ప‌టికే స‌మ‌ర్థ‌వంత‌మైన పోలీస్ ఆఫీస‌ర్ గా గుర్తింపు పొందారు అవినాష్ మొహంతి. ఆయ‌న‌కు కీల‌క ప‌ద‌వి క‌ట్ట‌బెట్టింది . సేఫ్ డైరెక్ట‌ర్ గా నియ‌మించింది. గతంలో తెలంగాణ డ్రగ్స్ కంట్రోల్ అడ్మినిస్ట్రేషన్…

    Leave a Reply

    Your email address will not be published. Required fields are marked *