రైతుల‌కు ఇబ్బందులు లేకుండా చూడాలి

స్ప‌ష్టం చేసిన మంత్రి పొన్నం ప్ర‌భాక‌ర్ గౌడ్

కరీంనగర్ జిల్లా : అన్న‌దాతలు పండించే ధాన్యానికి క‌నీస మ‌ద్ద‌తు ధ‌ర ల‌భించేలా చేస్తున్నామ‌న్నారు మంత్రి పొన్నం ప్ర‌భాక‌ర్. వరి ధాన్యం కొనుగోలు, ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణాలు,వేసవి కాలంలో తాగునీటి సమస్యలు లేకుండా తీసుకోవాల్సిన చర్యలపై హుస్నాబాద్ నియోజకవర్గం సైదాపూర్ మండలంపై జిల్లా అధికారులతో సమీక్షా సమావేశం నిర్వ‌హించారు. జిల్లా కలెక్టర్ చిత్రా మిశ్రా, అడిషనల్ కలెక్టర్ అశ్వినీ తానాజీ వాకడే, అడిషనల్ కలెక్టర్ రెవెన్యూ శ్రీనివాస్ రెడ్డి , డీఆర్డీవో శ్రీధర్ , ఆర్డీవో రమేష్ బాబు,ఇతర జిల్లా అధికారులు పాల్గొన్నారు.

ధాన్యం కొనుగోలు కేంద్రాల్లో రైతులకు ఇబ్బందులు లేకుండా చర్యలు తీసుకోవాలని మంత్రి ఆదేశించారు. ఏ ఒక్క‌రికి ఇబ్బంది త‌లెత్తినా చ‌ర్య‌లు త‌ప్ప‌వ‌న్నారు. ధాన్యం కొనుగోలు , ధాన్యం తరలింపు న‌కు వాహనాల ఇబ్బందులు లేకుండా చూడాల‌న్నారు., బార్థన్ ఇబ్బందులు, ధాన్యం కొనుగోలు జరిగిన వెంటనే పేమెంట్ జరిగేలా చ‌ర్య‌లు తీసుకోవాల‌ని ఆదేశించారు పొన్నం ప్ర‌భాక‌ర్ గౌడ్. మొదటి విడత లో ఇందిరమ్మ ఇళ్లు మంజూరు అయితే, వెంట‌నే ఇల్లు నిర్మాణం వేగంగా పూర్తి చేయాలని అన్నారు. ఇప్పటికే ఇళ్లు పూర్తయిన వారు గృహ ప్రవేశాలు చేసేందుకు కృషి చేయాల‌న్నారు. వేసవి కాలంలో గ్రామాల్లో తాగునీటి సమస్యలు లేకుండా తీసుకోవాల్సిన చర్యలపై అధికారులకు దిశా నిర్దేశం చేశారు.

  • Related Posts

    రాబోయే భ‌విష్య‌త్తును నిర్దేశించేది ఏఐనే

    చెన్నై : : ‘దేశమే ప్రథమం’ అనే సూత్రానికి కట్టుబడి, తమ జ్ఞానం, ఆవిష్కరణలు , నైపుణ్యాలను దేశ నిర్మాణానికి వినియోగించాలని ఉప రాష్ట్రపతి సి.పి. రాధాకృష్ణన్ పట్టభద్రులను కోరారు. చెన్నై సమీపంలోని కట్టంకుళత్తూరులో ఉన్న ఎస్.ఆర్.ఎం. ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ సైన్స్…

    తెలంగాణ ‘సేఫ్’ డైర‌క్ట‌ర్ గా అవినాష్ మొహంతి

    హైద‌రాబాద్ : తెలంగాణ ప్ర‌భుత్వం కీల‌క నిర్ణ‌యం తీసుకుంది. ఇప్ప‌టికే స‌మ‌ర్థ‌వంత‌మైన పోలీస్ ఆఫీస‌ర్ గా గుర్తింపు పొందారు అవినాష్ మొహంతి. ఆయ‌న‌కు కీల‌క ప‌ద‌వి క‌ట్ట‌బెట్టింది . సేఫ్ డైరెక్ట‌ర్ గా నియ‌మించింది. గతంలో తెలంగాణ డ్రగ్స్ కంట్రోల్ అడ్మినిస్ట్రేషన్…

    Leave a Reply

    Your email address will not be published. Required fields are marked *