హైద‌రాబాద్ బౌల‌ర్ల భ‌ర‌తం ప‌ట్టిన రికెల్ట‌న్

VijayaBhaskar · April 30, 2026
Spread the love

సెన్సేష‌న్ సెంచ‌రీతో చెల‌రేగిన క్రికెట‌ర్

ముంబై : ఐపీఎల్ మ్యాచ్ లో భాగంగా ముంబై వాంఖ‌డే స్టేడియంలో స‌న్ రైజర్స్ , ముంబై ఇండియ‌న్స్ జ‌ట్ల మ‌ధ్య జ‌రిగిన కీల‌క లీగ్ మ్యాచ్ లో గ్రాండ్ విక్ట‌రీ న‌మ‌దు చేసింది హైద‌రాబాద్. ఇరు జ‌ట్లు ప‌రుగుల వ‌ర‌ద పారించాయి. భారీ స్కోరు చేసినా ముంబై ఇండియ‌న్స్ కు ఓట‌మి త‌ప్ప‌లేదు. టాస్ గెలిచి న హైద‌రాబాద్ కెప్టెన్ ఫీల్డింగ్ ఎంచుకున్నాడు. మైదానంలోకి దిగిన ముంబైకి కొత్త ఓపెనింగ్‌ జోడీ జాక్స్‌, రికెల్టన్‌ ఆ జట్టుకు అదిరిపోయే ఆరంభాన్నిచ్చారు. పవర్‌ ప్లేలోనే వికెట్లేమీ నష్టపోకుండా 78 రన్స్ చేశారు. ఈ ఇద్ద‌రూ క‌లిసి 43 బంతుల్లోనే 93 రన్స్‌ జోడించారు.

ఎంద‌రు బౌల‌ర్ల‌ను మార్చినా వీరు ఎక్క‌డా త‌ల వంచ‌లేదు. బాద‌డ‌మే ప‌నిగా పెట్టుకున్నారు. నితీశ్‌ తన మొదటి ఓవర్లోనే జాక్స్‌ను ఔట్‌ చేయగా సూర్యకుమార్‌ (5) సైతం విఫలమయ్యాడు. మరో ఎండ్‌లో 23 బంతుల్లోనే అర్ధశతకం సాధించిన రికెల్టన్‌ ఆ తర్వాత జోరు పెంచాడు. నమన్‌ (22), హార్ధిక్‌ అతడికి అండగా నిలిచారు. 44 బంతుల్లో శతకం పూర్తిచేసిన రికెల్టన్‌ ఆ తర్వాత నెమ్మదించాడు. ఐపీఎల్‌లో అతడికి ఇదే తొలి శతకం. రికెల్టన్‌ జోరు తగ్గినా మరో ఎండ్‌లో హార్ధిక్‌ మెరుపులు మెరిపించాడు. అయితే అతడు నిష్క్రమించాక ముంబై పరుగుల వేటలో వెనుకబడింది. నిర్ణీత ఓవ‌ర్ల‌లో 243 ర‌న్స్ చేసింది.