newsseals.com
SPORTS

దంచి కొట్టిన‌ ట్రావిస్ హెడ్ ముంబై బౌల‌ర్ల‌కు షాక్

VijayaBhaskar April 30, 2026
newsseals-TravisHead
Spread the love

భారీ విజ‌యాన్ని న‌మోదు చేసిన స‌న్ రైజ‌ర్స్

ముంబై : ఐపీఎల్ 19వ సీజ‌న్ లో స‌న్ రైజ‌ర్స్ హైద‌రాబాద్ జైత్ర‌యాత్ర కొన‌సాగుతోంది. ఆజ‌ట్టుకు వ‌రుస‌గా ఇది ఆరో విజ‌యం కావ‌డం విశేషం. మ్యాచ్ లో భాగంగా ముందుగా బ్యాటింగ్ చేసింది ముంబై ఇండియ‌న్స్ . నిర్ణీత 20 ఓవ‌ర్ల‌లో 5 వికెట్లు కోల్పోయి 243 ప‌రుగులు చేసింది. అనంత‌రం భారీ టార్గెట్ ను అవ‌లీల‌గా పూర్తి చేసింది ఎస్ఆర్ హెచ్. 18.4 ఓవ‌ర్ల‌లోనే నిర్దేశించిన ల‌క్ష్యాన్ని కంప్లీట్ చేసింది. ఇక మ్యాచ్ విష‌యానికి వ‌స్తే 244 ప‌రుగుల ల‌క్ష్యంతో బ‌రిలోకి దిగిన హైద‌రాబాద్ ఓపెన‌ర్లు అభిషేక్ శ‌ర్మ‌, ట్రావిస్ హెడ్ లు ఆకాశ‌మే హ‌ద్దుగా చెల‌రేగారు.

ప‌వ‌ర్ ప్లే లోనే ఫోర్లు, సిక్స‌ర్ల‌తో విరుచుకు ప‌డ్డారు. ట్రావిస్ హెడ్ 30 బంతులు ఆడి 76 ర‌న్స్ చేశాడు. ఇందులో 4 ఫోర్లు, 8 సిక్సులు ఉన్నాయి. ఇక హెన్రిచ్ క్లాసెన్ 30 బాల్స్ ఫేస్ చేసి 65 ప‌రుగులు చేసి నాటౌట్ గా నిలిచాడు. త‌ను 7 ఫోర్లు 4 సిక్సులు కొట్టాడు. అభిషేక్ శ‌ర్మ 24 బంతులు ఆడి 45 ర‌న్స్ చేశాడు. ఇందులో 4 ఫోర్లు, 3 సిక్సులు ఉన్నాయి. స‌లీల్ అరోరా 10 బంతులు ఆడి 30 ప‌రుగులు చేసి అజేయంగా నిలిచాడు. ఇందులో 2 ఫోర్లు ఒక సిక్స్ ఉన్నాయి. ఇక ముంబై ఇండియ‌న్స్ జ‌ట్టుకు ఇది వ‌రుస‌గా ఆరో అప‌జ‌యం కావ‌డం గ‌మ‌నార్హం.