ఐపీఎల్ 2026 టైటిల్ ప‌క్కా మాదే : పరాగ్

రాజ‌స్థాన్ రాయ‌ల్స్ జ‌ట్టు స్కిప్ప‌ర్ కామెంట్స్

ముల్లాన్ పూర్ : ఐపీఎల్ 2026 లో భాగంగా జ‌రిగిన కీల‌క పోరులో బ‌ల‌మైన పంజాబ్ కింగ్స్ ఎలెవ‌న్ జ‌ట్టుకు కోలుకోలేని షాక్ ఇచ్చింది రాజ‌స్థాన్ రాయ‌ల్స్. తొలుత బ్యాటింగ్ చేసింది పంజాబ్ . నిర్ణీత 20 ఓవ‌ర్ల‌లో 222 ర‌న్స్ చేసింది. అనంత‌రం సునాయ‌సంగా టార్గెట్ ను పూర్తి చేసింది. మ్యాచ్ అనంత‌రం జ‌ట్టు కెప్టెన్ రియాన్ ప‌రాగ్ మీడియాతో మాట్లాడాడు. ఈ విజ‌యంతో ప్ర‌త్య‌ర్థుల‌కు మా స‌త్తా ఏమిటో అర్థ‌మై పోయింద‌న్నాడు. తాము ఎవ‌రినీ ప‌రిగ‌ణ‌లోకి తీసుకోబోమ‌ని పేర్కొన్నాడు. ఫామ్ అనేది తాత్కాలిక‌మ‌ని, క్లాస్ అనేది శాశ్వ‌తం అన్నాడు.

కొంద‌రు కావాల‌ని త‌మ‌ను టార్గెట్ చేయ‌డాన్ని త‌ప్పు ప‌ట్టాడు. వారి ఆందోళనలు మాకు సంబంధించినవి కావు, అందరివ‌ని కొట్టి పారేశాడు. చూస్తున్న ప్రతిఒక్కరూ, వ్యాఖ్యానిస్తున్న ప్రతిఒక్కరూ వారి ఆందోళనలతో త‌మ‌కు సంబంధం లేద‌న్నాడు ప‌రాగ్. మా ఆటగాళ్లపై, వారి సామర్థ్యాలపై మాకు చాలా నమ్మకం ఉందని చెప్పాడు.. మిడిల్ ఆర్డర్ విఫలమైనప్పుడు, ఓపెనర్లు, ఇతరులు జట్టును ముందుకు నడిపించాలి. మిడిల్ ఆర్డర్ రాణించినప్పుడు, మేము జట్టును ముందుకు నడిపిస్తామన్నాడు. కాబట్టి ఒక జట్టుగా, మాకు జట్టుపై పూర్తి నమ్మకం ఉంద‌న్నాడు. ఈసారి టైటిల్ ప‌క్కా త‌మ‌దేన‌ని ధీమా వ్య‌క్తం చేశాడు.

  • Related Posts

    ఐపీఎల్ 2027లో ఎంఎస్ ధోనీ ఆడేది క‌ష్ట‌మే ..?

    చెన్నై : అంద‌రి క‌ళ్లు మ‌హేంద్ర సింగ్ ధోనీపై ఉన్నాయి. ఈ ఏడాది 2026లో జ‌రిగిన ఐపీఎల్ లో ఆశించిన మేర రాణించ‌లేదు సీఎస్కే జ‌ట్టు. నిరాశజనకమైన ప్రదర్శనతో ప్లేఆఫ్స్‌కు చేరలేక పోయింది, ఇది అభిమానులను తీవ్ర నిరాశకు గురిచేసింది. దీనికి…

    ఐపీఎల్ సరైన సమయంలో జరగడం లేదు

    ఇంగ్లండ్ : ఐపీఎల్ మాజీ చైర్మ‌న్ ల‌లిత్ మోడీ సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేశారు. భార‌త దేశంలో తొలిసారిగా ఇండియ‌న్ ప్రిమీయ‌ర్ లీగ్ ను ప్రారంభించినప్పుడు ఏప్రిల్-మే నెలల విండోను ఎవరూ కోరుకో లేద‌న్నారు. ఎందుకంటే ఆ సమయంలో క్రికెట్ చాలా తక్కువగా…

    Leave a Reply

    Your email address will not be published. Required fields are marked *