10వ త‌ర‌గ‌తి రిజ‌ల్ట్స్ లో ఏపీ టాప్

బాలిక‌లు మెరుగైన ఫ‌లితాలు

అమ‌రావ‌తి : విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ ప్ర‌ణాళిక‌-దాని అమ‌లును నిరంత‌ర ప‌ర్య‌వేక్ష‌ణ చేయ‌డం, అధికార యంత్రాంగం అలుపెరుగ‌ని కృషి ఫలితంగా మార్చి 2026 ప‌దోత‌ర‌గ‌తి పబ్లిక్ పరీక్షలలో ఉత్తీర్ణత శాతం గత ఏడాదితో పోలిస్తే గణనీయంగా పెరిగింది. గ‌త ఏడాది 81.1 శాతం ఉత్తీర్ణత న‌మోదు కాగా, ఈ ఏడాది 100 రోజుల కార్యాచ‌ర‌ణ ప్ర‌ణాళిక విజ‌య‌వంత‌మై 85.25 శాతానికి ఉత్తీర్ణ‌త పెరిగింది. అన్ని ప్ర‌భుత్వ యాజ‌మాన్య పాఠ‌శాల‌ల్లో గ‌తేడాది 72.8 శాతం ఉన్న ఉత్తీర్ణ‌త ఈ సంవ‌త్స‌రం 78.39 శాతానికి పెరిగింది. ఈ ఏడాది ప‌రీక్షా ఫ‌లితాల్లో బాలుర కంటే బాలిక‌లు ఉత్తీర్ణ‌తా శాతం ఎక్కువ సాధించారు. బాలుర ఉత్తీర్ణత 82.68శాతం కాగా, బాలికల ఉత్తీర్ణత 87.90 శాతంగా ఫ‌లితాల్లో తేలింది. బాలుర కంటే బాలికలు 5.22 శాతం మెరుగైన ఫలితాలను సాధించి భ‌ళా బాలిక అనిపించుకున్నారు.

రాష్ట్రంలో మొత్తం 12089 స్కూళ్లు ఉండ‌గా, ఇందులో ప్ర‌భుత్వ యాజ‌మాన్య పాఠ‌శాల‌లు 6785 , ఎయిడెడ్ స్కూళ్లు 260, ప్రైవేటు స్కూళ్లు 5044 ఉన్నాయి. వీటిలో సున్నా శాతం ఫలితాలు వచ్చిన పాఠశాలలు 16. వీటిలోనూ ప్రైవేట్ స్కూళ్లు 11 కాగా, 2 ఎయిడెడ్‌, 2 ఆశ్ర‌మ పాఠ‌శాల‌లు, 1 జిల్లా ప‌రిష‌త్ హైస్కూల్ ఉంది. మొత్తంగా చూస్తే ప్ర‌భుత్వ యాజ‌మాన్య పాఠ‌శాల‌ల్లో సున్నా ఫ‌లితాలు వ‌చ్చిన‌వి కేవ‌లం 5గా ఉండి ప్ర‌భుత్వ విద్య నాణ్య‌తకు నిద‌ర్శ‌నంగా నిలుస్తున్నాయి.

  • Related Posts

    రాబోయే భ‌విష్య‌త్తును నిర్దేశించేది ఏఐనే

    చెన్నై : : ‘దేశమే ప్రథమం’ అనే సూత్రానికి కట్టుబడి, తమ జ్ఞానం, ఆవిష్కరణలు , నైపుణ్యాలను దేశ నిర్మాణానికి వినియోగించాలని ఉప రాష్ట్రపతి సి.పి. రాధాకృష్ణన్ పట్టభద్రులను కోరారు. చెన్నై సమీపంలోని కట్టంకుళత్తూరులో ఉన్న ఎస్.ఆర్.ఎం. ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ సైన్స్…

    తెలంగాణ ‘సేఫ్’ డైర‌క్ట‌ర్ గా అవినాష్ మొహంతి

    హైద‌రాబాద్ : తెలంగాణ ప్ర‌భుత్వం కీల‌క నిర్ణ‌యం తీసుకుంది. ఇప్ప‌టికే స‌మ‌ర్థ‌వంత‌మైన పోలీస్ ఆఫీస‌ర్ గా గుర్తింపు పొందారు అవినాష్ మొహంతి. ఆయ‌న‌కు కీల‌క ప‌ద‌వి క‌ట్ట‌బెట్టింది . సేఫ్ డైరెక్ట‌ర్ గా నియ‌మించింది. గతంలో తెలంగాణ డ్రగ్స్ కంట్రోల్ అడ్మినిస్ట్రేషన్…

    Leave a Reply

    Your email address will not be published. Required fields are marked *