newsseals.com
SPORTS

అంపైర్ నిర్ణ‌యం ర‌జ‌త్ పాటిదార్ ఆగ్ర‌హం

VijayaBhaskar May 1, 2026
newsseals-RajatPatidar
Spread the love

త‌ప్పుడు డెసిష‌న్ ఫ‌లితం మార్చేస్తుంది
అహ్మ‌దాబాద్ : ఐపీఎల్ 2026లో భాగంగా జ‌రిగిన కీల‌క లీగ్ మ్యాచ్ లో గిల్ నాయ‌క‌త్వంలోని గుజ‌రాత్ టైటాన్స్ డిఫెండింగ్ ఛాంపియ‌న్ రాయ‌ల్ ఛాలెంజర్స్ బెంగ‌ళూరు జ‌ట్టుకు కోలుకోలేని షాక్ ఇచ్చింది. 6 వికెట్ల తేడాతో గ్రాండ్ విక్ట‌రీ న‌మోదు చేసింది. ముందుగా టాస్ ఓడిన గుజ‌రాత్ 19.4 ఓవ‌ర్ల‌లోనే చాప చుట్టేసింది. 155 ప‌రుగులకే ఆల్ఔట్ అయ్యింది. అనంత‌రం బ‌రిలోకి దిగిన గుజ‌రాత్ ఆడుతూ పాడుతూ ల‌క్ష్యాన్ని ఛేదించింది. ఈ సంద‌ర్బంగా ఓట‌మి పాలైన కెప్టెన్ ర‌జ‌త్ పాటిదార్ నిప్పులు చెరిగాడు. అంపైర్ తీసుకున్న నిర్ణ‌యం దారుణంగా ఉంద‌న్నాడు.

ఈ రోజు, ఒక జట్టుగా మేము మరీ అంత చెత్తగా ఆడలేదు. కానీ కొన్నిసార్లు, కేవలం ఒక్క నిర్ణయం ఆట గతిని పూర్తిగా మార్చేస్తుంది. ఆ కీలక సమయంలో, ఆ ఒక్క నిర్ణయం మాకు వ్యతిరేకంగా రాకపోయి ఉంటే, మేము ఇంత తక్కువ స్కోరుకే ‘ఆల్ అవుట్’ అయ్యే వాళ్ళమని నేను అనుకోను. నిజం చెప్పాలంటే, అది చాలా దారుణమైన నిర్ణయం అని ఆరోపించాడు. అది కచ్చితంగా ‘అవుట్’ అయ్యే అవకాశమే లేదు. మైదానం నుండి బయటకు వచ్చాక నేను కూడా దాన్ని మళ్ళీ పరిశీలించి చూశాను. ఇలాంటి నిర్ణయాలు పదే పదే వస్తూ ఉంటే, ఆట ప్రమాణాలు కచ్చితంగా పడిపోతాయని అన్నాడు.