newsseals.com
SPORTS

వివాదాస్పద క్యాచ్ అవుట్‌పై విరాట్ కోహ్లీ ఫైర్

VijayaBhaskar May 1, 2026
newsseals-ViratKohli
Spread the love

ఇలాంటి నిర్ణ‌యాలు ఫ‌లితాలు మార్చేస్తాయి

గుజ‌రాత్ : ఐపీఎల్ 2026 మెగా టోర్నీలో భాగంగా జ‌రిగిన కీల‌క లీగ్ మ్యాచ్ లో ఊహించ‌ని రీతిలో దెబ్బ త‌గిలింది డిఫెండింగ్ ఛాంపియ‌న్ రాయ‌ల్ ఛాలెంజ‌ర్స్ బెంగ‌ళూరుకు. తొలుత మైదానంలోకి దిగిన ఆ జ‌ట్టు 19.4 ఓవ‌ర్ల‌లో 155 ప‌రుగుల‌కే చాప చుట్టేసింది. గుజ‌రాత్ బౌల‌ర్లు అర్ష‌ద్, ర‌షీద్ ఖాన్ తిప్పేశారు. ఇద్ద‌రూ క‌లిసి 5 కీల‌క వికెట్లు కూల్చారు. అనంత‌రం బ‌రిలో దిగిన గుజ‌రాత్ టైటాన్స్ స్కిప్ప‌ర్ శుభ్ మ‌న్ గిల్, ఇంగ్లండ్ స్టార్ క్రికెట‌ర్ జోస్ బ‌ట్ల‌ర్ దంచి కొట్టారు. ఆర్సీబీ బౌల‌ర్ల భ‌ర‌తం ప‌ట్టారు. ఇదిలా ఉండ‌గా గుజ‌రాత్ టైటాన్స్ బౌల‌ర్ వేసిన బంతికి ఆడిన క్యాచ్ వివాదాస్ప‌దంగా మారింది. దీనిపై విరాట్ కోహ్లీ స్పందించాడు.

ఈ స్థాయి టోర్నమెంట్‌లో ఇటువంటి నిర్ణయాలు తీసుకోవడం చూడటం నిజంగా తీవ్ర నిరాశను కలిగిస్తోంద‌ని అన్నాడు. మన వద్ద అన్ని రకాల సాంకేతిక సదుపాయాలు అందుబాటులో ఉన్నప్పటికీ, స్పష్టమైన నిర్ణయాలను కూడా సరిగ్గా తీసుకోలేక పోతున్నాం అని వాపోయాడు. జాసన్ డైవ్ పూర్తి చేస్తున్న సమయంలో, బంతి మైదానాన్ని తాకినట్లు స్పష్టంగా కనిపించిందని తెలిపాడు. ముఖ్యంగా మ్యాచ్ గతిని మార్చే కీలక సందర్భాలు వచ్చినప్పుడు, నిర్ణయాల్లో స్థిరత్వం , నిష్పక్షపాతాన్ని ఎవరైనా ఆశిస్తారని పేర్కొన్నాడు.