ఇది సమిష్టి విజ‌యం : పాట్ క‌మిన్స్

బ్యాట‌ర్లు, బౌల‌ర్లు అద్భుతంగా రాణించారు

ముంబై : ముంబై ఇండియన్స్‌పై ఘన విజయం సాధించిన సందర్భంగా ప్యాట్ కమిన్స్ ఆస‌క్తిక‌ర వ్యాఖ్య‌లు చేశాడు. మా జట్టు మొత్తానికి ఈ విజయం చాలా ప్రత్యేకం అని పేర్కొన్నాడు. ఒక జట్టుగా, ఈ రోజు మేము నిజంగా అద్భుతంగా ఆడామన్నాడు. స్కోరు బోర్డుపై లక్ష్యం 244 పరుగులు దాటినప్పుడు, మాకు మంచి ఆరంభం లభిస్తే, వాంఖేడే మైదానంలో ఆ లక్ష్యాన్ని మేము సునాయాసంగా ఛేదించగలమని మాకు పూర్తి నమ్మకం ఉందన్నాడు. ట్రావిస్ హెడ్, అభిషేక్ శర్మ మాకు అద్భుతమైన ఆరంభాన్ని అందించి, మ్యాచ్‌కు చక్కటి పునాది వేశార‌ని ప్ర‌శంసించారు.

ఆ తర్వాత హెన్రిక్ క్లాసెన్ బ్యాటింగ్ అయితే అత్యద్భుతంగా సాగిందని చెప్పాడు పాట్ క‌మిన్స్. ముంబై జట్టును వారి సొంత మైదానంలోనే ఓడించినందుకు మాకు చాలా సంతోషంగా ఉంద‌న్నాడు. ఇదిలా ఉండ‌గా టాస్ ఓడి పోవ‌డంతో ముందుగా బ్యాటింగ్ చేసింది హార్దిక్ పాండ్యా సార‌థ్యంలోని ముంబై ఇండియ‌న్స్ . ఆజ‌ట్టుకు ఏది క‌లిసి రావ‌డం లేదు ఈ ఐపీఎల్ 19 సీజ‌న్ లో. నిర్ణీత 20 ఓవ‌ర్ల‌లో 243 ప‌రుగుల భారీ స్కోర్ సాధించింది. రికెల్ట‌న్ అద్భుతంగా ఆడాడు. త‌క్కువ బంతుల్లో సంచ‌ల‌న శ‌త‌కం చేశాడు. కానీ వ‌ర్క‌వుట్ కాలేదు. అభిషేక్ శ‌ర్మ‌, ట్రావిస్ హెడ్ , క్లాసెన్ దుమ్ము రేపారు. కేవ‌లం 18.4 ఓవ‌ర్ల‌లోనే ప‌ని కానిచ్చేశారు.

  • Related Posts

    ఐపీఎల్ 2027లో ఎంఎస్ ధోనీ ఆడేది క‌ష్ట‌మే ..?

    చెన్నై : అంద‌రి క‌ళ్లు మ‌హేంద్ర సింగ్ ధోనీపై ఉన్నాయి. ఈ ఏడాది 2026లో జ‌రిగిన ఐపీఎల్ లో ఆశించిన మేర రాణించ‌లేదు సీఎస్కే జ‌ట్టు. నిరాశజనకమైన ప్రదర్శనతో ప్లేఆఫ్స్‌కు చేరలేక పోయింది, ఇది అభిమానులను తీవ్ర నిరాశకు గురిచేసింది. దీనికి…

    ఐపీఎల్ సరైన సమయంలో జరగడం లేదు

    ఇంగ్లండ్ : ఐపీఎల్ మాజీ చైర్మ‌న్ ల‌లిత్ మోడీ సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేశారు. భార‌త దేశంలో తొలిసారిగా ఇండియ‌న్ ప్రిమీయ‌ర్ లీగ్ ను ప్రారంభించినప్పుడు ఏప్రిల్-మే నెలల విండోను ఎవరూ కోరుకో లేద‌న్నారు. ఎందుకంటే ఆ సమయంలో క్రికెట్ చాలా తక్కువగా…

    Leave a Reply

    Your email address will not be published. Required fields are marked *