Saturday, 17 October 2026

ఈ జ‌న్మ‌లో అమ‌రావ‌తి నిర్మాణం పూర్తి కాదు

newsseals-AmbatiRammbabu

అంబ‌టి రాంబాబు షాకింగ్ కామెంట్స్

నంద్యాల జిల్లా : మాజీ మంత్రి అంబ‌టి రాంబాబు సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేశారు. ఏపీ సీఎం నారా చంద్రబాబు నాయుడు, మంత్రి నారా లోకేష్ పై మండిప‌డ్డారు. నంద్యాల‌లో మీడియాతో మాట్లాడారు.
చంద్రబాబు, లోకేష్ ఈ జన్మలో అమరావతి నిర్మాణం పూర్తి చేయలేరని అన్నారు. రాష్ట్ర ప్రజలను దోచుకోవడానికే చంద్రబాబు అమరావతిని నిర్మిస్తున్నారని ఆరోపించారు. రూ. 2 లక్షల కోట్ల ప్రతిపాదనలతో ఇప్పటికే రూ. 75 వేల కోట్లు ఖర్చు చేశారని పేర్కొన్నారు. అమరావతి కాంట్రాక్టర్లకు ప్రజల సొమ్ము దోచిపెట్టడం సరైంది కాదని ధ్వ‌జ‌మెత్తారు.

చంద్రబాబు ప్రభుత్వం సిగ్గు తెచ్చుకోవాలంటూ అంబటి తీవ్ర విమర్శలు చేశారు. ఈ జ‌న్మ‌లో సీఎం, మంత్రి అమ‌రావ‌తి రాజ‌ధాని నిర్మాణం పూర్తి చేయ‌లేర‌న్నారు అంబ‌టి రాంబాబు. రాష్ట్రాన్ని అన్ని రంగాల‌ను స‌ర్వ నాశ‌నం చేశార‌ని ఆరోపించారు. వారి నిర్వాకం వ‌ల్ల‌నే ఏపీ మ‌రో వందేళ్లు వెన‌క్కి వెళుతోంద‌న్నారు. ప‌రిశ్ర‌మ‌ల పేరుతో పేద‌ల భూములు లాక్కుంటున్నార‌ని, ఇది ఎంత వ‌ర‌కు స‌బ‌బు అని ప్ర‌శ్నించారు అంబ‌టి రాంబాబు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *