newsseals.com
News

బీజేపీ అధికార దుర్వినియోగం : శివ‌కుమార్

VijayaBhaskar May 4, 2026
newsseals-DKShivakumar
Spread the love

సంచ‌ల‌న ఆరోప‌ణ‌లు చేసిన డిప్యూటీ సీఎం

బెంగ‌ళూరు : తాజాగా దేశంలోని ఐదు రాష్ట్రాల ఎన్నిక‌ల ఫ‌లితాలు వెల్ల‌డ‌య్యాయి. ఈ సంద‌ర్బంగా స్పందించారు క‌ర్ణాట‌క డిప్యూటీ సీఎం డీకే శివ‌కుమార్. ఆయ‌న సోమ‌వారం మీడియాతో మాట్లాడారు.
ఉత్తర భారతదేశంలోనూ, తమిళనాడుతో సహా దక్షిణాన కూడా బీజేపీ పక్షాన అధికార దుర్వినియోగం చేసింద‌ని మండిప‌డ్డారు. దీనిపై విచార‌ణ జ‌రిపించాల్సిన అవ‌స‌రం ఉంద‌న్నారు. ప్ర‌త్యేకించి పార‌ద‌ర్శ‌క‌త‌తో వ్య‌వ‌హ‌రించాల్సిన ఎన్నిక‌ల సంఘం పూర్తిగా బీజేపీ గెలుపొందేలా ప్ర‌య‌త్నం చేసింద‌ని ఆరోపించారు. ఇది మంచి ప‌ద్ద‌తి కాద‌న్నారు డీకే శివ‌కుమార్ .

అక్ర‌మాలు చోటు చేసుకున్నాయి. అది విప‌రీత‌మైన‌ స్థాయిలో జరిగిందన్నారు డీకే శివ‌కుమార్. పోలీసులు పెద్ద సంఖ్యలో మోహరించబడ్డారు..ఒక భారీ మార్పు స్పష్టంగా కనిపించింది. అయితే కేరళ విషయానికి వస్తే, అక్కడి ప్రజలు కాంగ్రెస్ పార్టీకి మంచి తీర్పును (mandate) ఇచ్చారు. తమిళనాడులో AIADMK ,బీజేపీ కూటమికి వారు మద్దతు ఇవ్వలేదు అని పేర్కొన్నారు డీకే శివ‌కుమార్. దక్షిణ భారతదేశంలో వచ్చిన ఫలితాల పట్ల తాము ఎంతో సంతోషంగా ఉన్నామన్నారు.