కేర‌ళ విజ‌యం సీఎం సంతోషం

VijayaBhaskar · May 4, 2026
Spread the love

నా ప్ర‌చారం వ‌ల్లే యూడీఎఫ్ విక్ట‌రీ

హైద‌రాబాద్ : కేర‌ళ‌లో కాంగ్రెస్ పార్టీతో కూడిన యుడీఎఫ్ ఎల్డీఎఫ్ ను కాద‌ని ప‌వ‌ర్ లోకి వ‌చ్చింది. దీనిపై స్పందించారు సీఎం ఎ. రేవంత్ రెడ్డి. త‌ను ప్ర‌చారం కూడా చేశారు. త‌ప్ప‌కుండా తాము గెల‌వ‌బోతున్నామ‌ని, ఇక పిన‌ర‌యి విజ‌య‌న్ ఇంటికి వెళ్లాల్సిందేన‌ని ఎద్దేవా కూడా చేశారు. ఆయ‌న చేసిన కామెంట్స్ అప్ప‌ట్లో వైర‌ల్ అయ్యాయి. దీనిపై తీవ్ర అభ్యంత‌రం తెలిపారు మాజీ సీఎం విజ‌య‌న్. కానీ ఇవేవీ ప‌ట్టించుకోలేదు రేవంత్ రెడ్డి. ఈ సంద‌ర్బంగా ఇవాళ ఫ‌లితాలు ఆశాజ‌న‌కంగా ఉన్నాయి. దీంతో రాజ‌కీయాల‌లో పెను మార్పులు చోటు చేసుకోవ‌డం ఖాయ‌మ‌ని పేర్కొన్నారు.

కేరళలో కాంగ్రెస్ నేతృత్వంలోని యూడీఎఫ్ కూటమి నాయకులు, కార్యకర్తలు , కేడర్‌కు అసాధారణమైన, కఠోరమైన , స్ఫూర్తి దాయకమైన విజయం సాధించినందుకు నా హృదయపూర్వక అభినందనలు తెలిపారు సీఎం.ఈ చారిత్రాత్మక విజయానికి నాయకత్వం వహించిన నాయకత్వానికి, ముఖ్యంగా రాహుల్ గాంధీ, మ‌ల్లికార్జున్ , ప్రియాంక గాంధీ, సోనియా గాంధీ, వేణుగోపాల్ కు కృత‌జ్ఞ‌త‌లు తెలిపారు. వ్యక్తిగతంగా, కేరళలో నా ప్రచారం సందర్భంగా నాపై తమ హృదయ పూర్వక ప్రేమను కురిపించిన యూడీఎఫ్ మద్దతుదారులందరికీ, కేరళ ప్రజలకు ధన్యవాదాలు తెలియ జేస్తున్నట్లు పేర్కొన్నారు సీఎం.