Friday, 16 October 2026

నియోజకవర్గాల్లోనూ గ్రీవియన్స్ డే నిర్వహించాలి

newsseals-CM

ఆదేశించిన సీఎం నారా చంద్ర‌బాబు నాయుడు

అమ‌రావ‌తి : ఏపీ సీఎం నారా చంద్ర‌బాబు నాయుడు సంచ‌ల‌న నిర్ణ‌యం తీసుకున్నారు. ఇక‌పై ప్ర‌తి నియోజ‌క‌వ‌ర్గంలోనూ గ్రీవియన్స్ డే నిర్వహించాలని కలెక్టర్లను ఆదేశించారు. పీజీఆర్ఎస్ విధానంలో ప్రజా ప్రతినిధులు-అధికారులు కలిసి నిర్వహించేలా చూడాలన్నారు. పీజీఆర్ఎస్ కోసం ప్రజాదర్భార్ లాంటి ఓ వేదికను ఏర్పాటు చేయ‌బోతున్నామ‌ని ప్ర‌క‌టించారు. ఫిర్యాదులు స్వీకరించే సమయంలోనే ప్రజాప్రతినిధులు, అధికారులు కలిసి పరిష్కరించే ప్రయత్నం చేద్దాం అన్నారు. సింగపూర్ లో ఇదే రకంగా ఫిర్యాదుల పరిష్కారం జరుగుతోందని చెప్పారు. మండల స్థాయిలోనూ పీజీఆర్ఎస్ లో వచ్చిన ఫిర్యాదులను పరిష్కరించటం ద్వారా ప్రజలకు ఉపయోగ పడుతుందన్నారు.

ప్రతి సోమవారం కలెక్టరేట్లో గ్రీవియన్స్ స్వీకరిస్తున్నట్టే… ఇకపై ప్రతి శుక్రవారం నియోజకవర్గాల్లో గ్రీవియన్స్ స్వీకరించాలని స్ప‌ష్టం చేశారు. ప్రతీ శుక్రవారం ఫీల్డ్ గ్రీవెన్స్ డేగా నిర్ణయిచాం అని తెలిపారు.
సమస్యలు పరిష్కారమైతే బ్రాండ్ రావటంతో పాటు ప్రజల్లో విశ్వాసం పెరగటం ముఖ్యం అన్నారు. కాగితాలు తీసుకుని కార్లో వదిలి పెట్టొద్దన్నారు. పిటిషన్లకు పరిష్కారం చూపాలన్నారు. ప్రతీ నెలా ఒక నియోజకవర్గాన్ని నాలుగు సార్లు సందర్శించాలన్నారు. సమస్యల పరిష్కారానికి గుడ్ విల్ మిషన్ గా కలెక్టర్లు క్షేత్రస్థాయికి వెళ్లాల‌ని ఆదేశించారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *