ఫిన్ అలెన్ విధ్వంసక‌ర ఇన్నింగ్స్

VijayaBhaskar · May 9, 2026
Spread the love

47 బంతులు 5 ఫోర్లు 10 సిక్సులు

ఢిల్లీ : ఐపీఎల్ మెగా టోర్నీలో ఆశించిన స్థాయిలో రాణించ‌డం లేదు ఢిల్లీ క్యాపిట‌ల్స్. ఆ జ‌ట్టు ప‌రాజ‌యాల ప‌రంప‌ర కొన‌సాగుతూనే ఉంది. ముందుగా బ్యాటింగ్ కు దిగిన స‌ద‌రు టీం కేవ‌లం 147 ప‌రుగులు మాత్ర‌మే చేసింది. అనంత‌రం స్వ‌ల్ప ల‌క్ష్య ఛేద‌న‌ను అల‌వోక‌గా ఆడుతూ పాడుతూ ఛేదించింది కేవ‌లం 2 వికెట్లు మాత్ర‌మే కోల్పోయి. ఈ త‌రుణంలో మైదానంలోకి వ‌చ్చిన ఫిన్ అలెన్ వ‌చ్చీ రావ‌డంతోనే బాద‌డం మొద‌లు పెట్టాడు. ఢిల్లీ బౌల‌ర్ల‌కు చుక్క‌లు చూపించాడు. ఎడా పెడా దంచుతూ దుమ్ము రేపాడు అలెన్. త‌న విధ్వంస‌క‌ర‌మైన బ్యాటింగ్ కు బెంబేలెత్తి పోయారు ఢిల్లీ బౌల‌ర్లు. ఎంత మందిని మార్చినా ఫ‌లితం లేకుండా పోయింది.

ఓపెనింగ్ కు వ‌చ్చిన ఫిన్ అలెన్ కోల్ క‌తా నైట్ రైడ‌ర్స్ జ‌ట్టు విజ‌యంలో కీల‌క పాత్ర పోషించాడు. త‌ను కేవ‌లం 47 బంతులు మాత్ర‌మే ఎదుర్కొన్నాడు. ఇందులో 5 ఫోర్లు 10 భారీ సిక్స‌ర్లు ఉన్నాయి. కాగా ఈ మెగా టోర్న‌మెంట్ లో ఫిన్ అలెన్ కు ఇది తొలి సెంచ‌రీ కావ‌డం విశేషం. నిర్దేశించిన టార్గెట్ ను కేవ‌లం 14.2 ఓవ‌ర్ల‌లోనే పూర్తి చేసింది కేకేఆర్. దీంతో ఆ జ‌ట్టుకు ఇది నాలుగో విజ‌యం కావ‌డం విశేషం. ప్ర‌స్తుతం ప్లే ఆఫ్స్ ఆశ‌లు స‌జీవంగా ఉంచుకున్న‌ట్ల‌యింది.