తిప్పేసిన ర‌షీద్ ఖాన్ త‌ల‌వంచిన రాజ‌స్తాన్

VijayaBhaskar · May 10, 2026
Spread the love

4 ఓవ‌ర్లు 33 ప‌రుగులు 4 కీల‌క వికెట్లు

జైపూర్ : ఐపీఎల్ మెగా టోర్న‌మెంట్ లో భాగంగా జైపూర్ లోని స‌వాయి మాన్ సింగ్ స్టేడియం వేదిక‌గా జ‌రిగిన కీల‌క‌మైన లీగ్ మ్యాచ్ లో గిల్ సార‌థ్యంలోని గుజ‌రాత్ టైటాన్స్ స‌త్తా చాటింది 77 ప‌రుగుల తేడాతో ఆతిథ్య జ‌ట్టు రాజ‌స్తాన్ రాయ‌ల్స్ ను ఓడించింది. ద‌ర్జాగా ప్లే ఆఫ్స్ కు చేరుకుంది. పాయింట్ల ప‌ట్టిక‌లో టాప్ లో నిలిచింది. ఇక మ్యాచ్ విష‌యానికి వ‌స్తే ముందుగా గుజ‌రాత్ బ్యాటింగ్ చేసింది. నిర్ణీత 20 ఓవ‌ర్ల‌లో 229 ప‌రుగులు చేసింది నాలుగు వికెట్లు కోల్పోయి. జేస‌న్ హోల్డ‌ర్ 12 ప‌రుగులు ఇచ్చి 3 వికెట్లు తీశాడు.

అనంత‌రం మైదానంలోకి దిగింది రాజ‌స్తాన్ రాయ‌ల్స్ . ఎప్ప‌టి లాగే టాప్ ఫామ్ లో ఉన్న యంగ్ క్రికెట‌ర్ వైభవ్ సూర్య వంశీ ధాటిగా ఆడాడు. త‌ను 36 ప‌రుగులు చేసి పెవిలియ‌న్ బాట ప‌ట్టాడు. ఇక ర‌వీంద్ర జ‌డేజా 38 ప‌రుగుల‌తో రాణించాడు. రాజ‌స్తాన్ జ‌ట్టులో ఈ ఇద్ద‌రు మాత్ర‌మే ఆడారు. మిగ‌తా వాళ్లంతా పెవిలియ‌న్ బాట ప‌ట్టారు. ప్ర‌ధానంగా చెప్పుకోవాల్సింది ఆప్గ‌నిస్తాన్ తురుపు ముక్క ర‌షీద్ ఖాన్ గురించి. త‌ను మ‌రోసారి కీల‌కంగా మారాడు. 4 ఓవ‌ర్లు వేసి 33 ప‌రుగులు ఇచ్చి 4 వికెట్లు కూల్చాడు. త‌న స్పిన్ మాయాజాలానికి రాజ‌స్తాన్ బ్యాట‌ర్లు విల విల లాడారు.