ఆటోల‌ను ఈవీ వాహ‌నాలుగా చేస్తాం : సీఎం

కాలుష్య రహిత నగరంగా తీర్చిదిద్దుతాం

హైద‌రాబాద్ : సీఎం రేవంత్ రెడ్డి కీల‌క వ్యాఖ్య‌లు చేశారు. హైద‌రాబాద్ న‌గ‌రాన్ని కాలుష్య ర‌హిత న‌గ‌రంగా మారుస్తామ‌న్నారు. నగరంలో ఉన్న ఆటోలను ఈవీ వాహనాలుగా మార్చడానికి ప్రభుత్వ నిధులతో రెట్రో ఫిట్టింగ్ చేయిస్తామని ప్రకటించారు. ఇందుకు సంబంధించి 5 కంపెనీలతో చర్చలు జరుపుతున్నట్టు తెలిపారు.హైదరాబాద్ హజ్ హౌజ్‌లో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ముఖ్యమంత్రి పాల్గొన్నారు. హ‌జ్ యాత్రకు బయలుదేరే యాత్రికుల బస్సులను జెండా ఊపి ప్రారంభించారు. యాత్రకు వెళుతున్న హాజీలకు తెలంగాణ ప్రభుత్వం తరఫున హార్దిక శుభాకాంక్షలు తెలిపారు. మైనారిటీల సంక్షేమం, అభివృద్ధి విషయంలో ప్రజా ప్రభుత్వం ఎప్పుడూ ముందుంటుందని చెప్పారు.

హిందూ ముస్లింలు తనకు రెండు కళ్ల లాంటి వారని, హిందూ ముస్లింలు ఇద్దరూ అన్నదమ్ములని, కలిసి తెలంగాణ అభివృద్ధి కోసం ముందుకు సాగుదామని అన్నారు. రాష్ట్రంలో సంక్షేమం, అభివృద్ధి కార్యక్రమాల్లో మైనారిటీల భాగస్వామ్యంతో ప్రభుత్వం ముందుకు వెళుతోందన్నారు. మైనారిటీల నిష్పత్తి మేరకు వారికి దక్కాల్సిన సంక్షేమ పథకాలు దక్కుతాయని స్పష్టం చేశారు. ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్ కారణంగా వైట్ కాలర్ ఉద్యోగాలు ప్రమాదంలో పడుతున్న పరిస్థితులను అవగాహన చేసుకుని బ్లూ కాలర్ జాబ్స్ పొందడానికి వీలుగా నైపుణ్య శిక్షణ అవసరమని చెప్పారు. ప్రభుత్వం స్కిల్స్ పైన ఎక్కువగా దృష్టి సారించిందని, స్కిల్స్‌లో మంచి శిక్షణనిచ్చే ఏటీసీ, పాలిటెక్నిక్, స్కిల్స్ యూనివర్సిటీలో చదువుకునే అవకాశాలను అంది పుచ్చుకోవాలని విద్యార్థులకు హితవు పలికారు.

  • Related Posts

    రాబోయే భ‌విష్య‌త్తును నిర్దేశించేది ఏఐనే

    చెన్నై : : ‘దేశమే ప్రథమం’ అనే సూత్రానికి కట్టుబడి, తమ జ్ఞానం, ఆవిష్కరణలు , నైపుణ్యాలను దేశ నిర్మాణానికి వినియోగించాలని ఉప రాష్ట్రపతి సి.పి. రాధాకృష్ణన్ పట్టభద్రులను కోరారు. చెన్నై సమీపంలోని కట్టంకుళత్తూరులో ఉన్న ఎస్.ఆర్.ఎం. ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ సైన్స్…

    తెలంగాణ ‘సేఫ్’ డైర‌క్ట‌ర్ గా అవినాష్ మొహంతి

    హైద‌రాబాద్ : తెలంగాణ ప్ర‌భుత్వం కీల‌క నిర్ణ‌యం తీసుకుంది. ఇప్ప‌టికే స‌మ‌ర్థ‌వంత‌మైన పోలీస్ ఆఫీస‌ర్ గా గుర్తింపు పొందారు అవినాష్ మొహంతి. ఆయ‌న‌కు కీల‌క ప‌ద‌వి క‌ట్ట‌బెట్టింది . సేఫ్ డైరెక్ట‌ర్ గా నియ‌మించింది. గతంలో తెలంగాణ డ్రగ్స్ కంట్రోల్ అడ్మినిస్ట్రేషన్…

    Leave a Reply

    Your email address will not be published. Required fields are marked *