Friday, 16 October 2026

ప్ర‌భుత్వ ఏర్పాటుకు అనుమ‌తి ఇవ్వండి

newsseals-TVKVijay

గ‌వ‌ర్న‌ర్ ను కోరిన టీవీకే పార్టీ చీఫ్ విజ‌య్

చెన్నై : త‌మిళ‌నాడులో చోటు చేసుకున్న రాజ‌కీయ ప‌రిణామాల నేప‌థ్యంలో చోటు చేసుకున్న ఉత్కంఠ‌కు తెర దించారు టీవీకే పార్టీ చీఫ్ జోసెఫ్ విజ‌య్. ఆయ‌న మ‌ర్యాద పూర్వ‌కంగా గ‌వ‌ర్న‌ర్ రాజేంద్ర‌ను క‌లిశారు. ఈ ఇద్ద‌రి మ‌ధ్య 10 నిమిషాల పాటు చ‌ర్చ‌లు కొన‌సాగాయి. త‌న‌ టీవీకే పార్టీకి 120 ఎమ్మెల్యేల మద్దతు ఉందని, ప్రభుత్వ ఏర్పాటుకు ఆహ్వానించాలని కోరారు. కాంగ్రెస్ సహా తమకు లెఫ్ట్ పార్టీలు, VCK మద్దతు ఉందని లేఖ‌లు అంద‌జేశారు. దీంతో త‌న‌కు గ్రీన్ సిగ్న‌ల్ ఇచ్చారు. ఇవాళ సీఎంగా కొలువు తీర‌నున్నారు టీవీకే విజ‌య్. సీఎంగా ఆయ‌న‌తో ప్ర‌మాణ స్వీకారం చేయించ‌నున్నారు.

ఇదిలా ఉండ‌గా త‌న పార్టీ ప్ర‌భుత్వ ఏర్పాటుకు అవ‌స‌ర‌మైన మ‌ద్ద‌తు కూడ‌గ‌ట్ట‌డంలో విజ‌య్ స‌క్సెస్ అయ్యారు. ఉభయ కమ్యూనిస్ట్ పార్టీలు బేషరతుగా మద్దతు ప్రకటించడం విశేషం. విజయ్ పార్టీకి బయటి నుండి బేషరతుగా మద్దతు ఇవ్వనున్నారు. తాము ప్రభుత్వంలో చేరడం లేదని స్పష్టత ఇచ్చిన రెండు కమ్యూనిస్టు పార్టీల జాతీయ నాయకత్వం . అంతే కాకుండా తాము డీఎంకే తో కలిసి ప్రజా సమస్యలపై పోరాటాలు కొనసాగిస్తామని చెప్పాయి రెండు పార్టీలు. కేవలం బీజేపీ ఎత్తుగడలను అడ్డుకోవడమే లక్ష్యంగా విజయ్ పార్టీకి మద్దతు ఇస్తున్నట్లు పరోక్షంగా స్పష్టత ఇచ్చిన కమ్యూనిస్టు నేతలు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *