వెంటనే విచారణ చేపట్టాలని ఆదేశం
హైదరాబాద్ : దేశ వ్యాప్తంగా సంచలనం రేపింది కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్ పటేల్ కొడుకు బండి భగీరథ కు సంబంధించిన పోలీస్ పోక్సో కేసు. ఇప్పటి వరకు తనను పోలీసులు అరెస్ట్ చేయక పోవడం పట్ల తీవ్ర ఆగ్రహం వ్యక్తం అవుతోంది. దీనిపై ఆరా తీశారు సీఎం ఎ. రేవంత్ రెడ్డి సోమవారం. పేట్ బషీరాబాద్ పోలీస్ స్టేషన్ లో బండి భగీరథ్ పైన నమోదైన నమోదు కేసుపైన తక్షణమే విచారణ మొదలు పెట్టాలని రేవంత్ రెడ్డి రాష్ట్ర డీజీపీ సీవీ ఆనంద్ ను ఆదేశించారు.
8 వ తేదీన ఫిర్యాదు వస్తే ఇప్పటి వరకు ఎందుకు చర్యలు తీసుకోలేదని డీజీపీ ని ముఖ్యమంత్రి ప్రశ్నించారు. కేసు వివరాలను డీజీపీ సీవీ ఆనంద్ సీఎంకు వివరించారు. ప్రధాన మంత్రి మోదీ హైదరాబాద్ పర్యటన నేపథ్యంలో పోలీస్ సిబ్బంది అంతా భద్రతా ఏర్పాట్లలో నిమగ్నమయ్యారని డీజీపీ వివరించారు. కేసు సమగ్ర విచారణ కోసం ప్రత్యేక టీం లను ఏర్పాటు చేయాలని ముఖ్యమంత్రి డీజీపీ ని ఆదేశించారు. మరో వైపు తక్షణమే ఎందుకు అరెస్ట్ చేయడం లేదంటూ పెద్ద ఎత్తున విపక్షాలు ప్రశ్నిస్తున్నాయి.





