బండి సంజ‌య్ కొడుకును అరెస్ట్ చేస్తాం

Spread the love

కూక‌ట్ ప‌ల్లి డీసీపీ రితి రాజు ప్ర‌క‌ట‌న

హైద‌రాబాద్ : దేశ వ్యాప్తంగా సంచ‌ల‌నం సృష్టించింది కేంద్ర హోం శాఖ స‌హాయ మంత్రి బండి సంజ‌య్ కుమార్ ప‌టేల్ కొడుకు బండి భ‌గీర‌థ్ పై న‌మోదైన పోక్సో కేసు. రాష్ట్ర వ్యాప్తంగా పెద్ద ఎత్తున ఆందోళ‌న‌లు, నిర‌స‌న‌లు వ్య‌క్తం అవుతున్నాయి. ఈ త‌రుణంలో డీజీపీ వివ‌ర‌ణ ఇచ్చారు సీఎం రేవంత్ రెడ్డి. ఈ మేర‌కు ఆయ‌న సిట్ ను ఏర్పాటు చేశారు. పేట్ బషీరాబాద్ పి.యస్ పరిధి లో నమోదైన బండి సంజయ్ కుమారుడు బండి భగీరథ్ పై నమోదైన ఫోక్సో కేసులో విచారణ లో భాగంగా పియస్ కు చేరుకున్నారు (సిట్ విచారణ అధికారిణి) కూకట్ పల్లి డిసిపి రితిరాజ్ గైక్వాడ్ .

ఎస్ హెచ్ఓ క్యాబిన్ లో డిసిపి తో పాటు ఏసిపిల మీటింగ్ అనంతరం మీడియా తో మాట్లాడారు. ఈ రోజు పోలీసుల ఉన్నత అధికారుల ఆదేశాలు మేరకు విచారణ ప్రారంభించామని చెప్పారు. నిందితులు ఎవరైనా వారిపై చర్యలు తీసుకొంటామని అన్నారు. తర్వలో మైనర్ భాదితురాలు స్టేట్మెంట్ రికార్డ్ సైతం నమోదు చేస్తామని డీసీపీ రితిరాజు గైక్వాడ్ స్ప‌ష్టం చేశారు. ఇదిలా ఉండ‌గా ప్ర‌స్తుతం పోక్సో కేసు న‌మోదు అయ్యాక బండి సంజ‌య్ కొడుకు ప‌రారీలో ఉన్నార‌ని , ఆయ‌న‌ను ప‌ట్టుకుని తీరుతామ‌ని అంటున్నారు.

  • Related Posts

    నీట్ యుజి 2026 పేప‌ర్ లీక్ పై సీబీఐ ద‌ర్యాప్తు

    Spread the love

    Spread the loveచావు క‌బురు చ‌ల్ల‌గా చెప్పిన కేంద్ర ప్ర‌భుత్వం న్యూఢిల్లీ : ఈఏడాదిలో నిర్వ‌హించిన నీట్ – యుజి 2026 ప‌రీక్షను ర‌ద్దు చేస్తున్న‌ట్లు ప్ర‌క‌టించింది నేష‌న‌ల్ టెస్టింగ్ ఏజెన్సీ (ఎన్టీఏ). పేప‌ర్ లీక్ అయ్యింద‌ని , దీనిపై కేంద్ర…

    ప్ర‌జ‌ల‌ను విభ‌జించే స‌న‌తాన ధ‌ర్మం వ‌ద్దు

    Spread the love

    Spread the loveశాస‌న స‌భ‌లో ఉద‌య‌నిధి స్టాలిన్ కామెంట్స్ చెన్నై : డీఎంకే ప్ర‌తిప‌క్ష నాయ‌కుడు ఉద‌య‌నిధి స్టాలిన్ సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేశారు. మంగ‌ళ‌వారం ప్రారంభ‌మైన శాస‌న స‌భ‌లో ప్ర‌సంగించారు. ఈ సంద‌ర్బంగా మ‌రోసారి స‌నాత‌న ధ‌ర్మం గురించి ప్ర‌త్యేకంగా ప్ర‌స్తావించారు.…

    Leave a Reply

    Your email address will not be published. Required fields are marked *