అగ్నిమాపక శాఖకు కొత్త శక్తి : అనిత

VijayaBhaskar · May 13, 2026
Spread the love

మ‌రింత స‌మ‌ర్థ‌వంతంగా ప‌ని చేయాలి

అమ‌రావ‌తి : అగ్ని మాప‌క శాఖ ప‌నితీరు మ‌రింత మెరుగు ప‌డాల్సిన అవ‌స‌రం ఉంద‌న్నారు రాష్ట్ర హోం , విప‌త్తుల నిర్వ‌హ‌ణ శాఖ మంత్రి వంగ‌ల‌పూడి అనిత‌. అమ‌రావ‌తి స‌చివాల‌యంలో అగ్నిమాపక శాఖపై సమగ్ర సమీక్ష నిర్వహించారు. శాఖను మరింత సమర్థంగా, వేగంగా తీర్చిదిద్దేందుకు కీలక నిర్ణయాలు తీసుకున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ఫైర్ స్టేష‌న్ల‌లో మౌలిక వ‌స‌తుల క‌ల్ప‌న‌కు పెద్ద‌పీట వేస్తామ‌న్నారు వంగ‌ల‌పూడి అనిత‌. స‌మావేశం అనంత‌రం హోం శాఖ మంత్రి మీడియాతో మాట్లాడారు. కూట‌మి ప్ర‌భుత్వం వ‌చ్చాక అన్ని శాఖ‌ల ప‌నితీరు మెరుగు ప‌డింద‌న్నారు. బ‌డ్జెట్ లో భారీ ఎత్తున నిధుల‌ను కేటాయించామ‌న్నారు అనిత‌.

ప్ర‌ధానంగా అగ్ని మాప‌క శాఖ‌కు సంబంధించి కీల‌క సూచ‌న‌లు చేశారు హోం శాఖ మంత్రి. ఫైర్ స్టేషన్ లేని నియోజకవర్గాల్లో కొత్త స్టేషన్లు ఏర్పాటుకు ఆదేశాలు జారీ చేసిన‌ట్లు వెల్ల‌డించారు. సంఘ‌ట‌న స‌మ‌యంలో వేగంగా చేరుకునేలా చ‌ర్య‌లు చేప‌ట్టామ‌న్నారు. స్పందన సమయం 15 నిమిషాలకు తగ్గించే దిశగా చర్యలు తీసుకోవాల‌ని ఆదేశించిన‌ట్లు తెలిపారు వంగ‌ల‌పూడి అనిత‌. నూత‌న టెక్నాల‌జీ ని ఉప‌యోగించుకుని డ్రోన్లతో అడవి అగ్నిప్రమాదాల నియంత్రణపై ప్రత్యేక దృష్టి సారిస్తామ‌న్నారు .
పాఠశాలలు, ఆస్పత్రులు, పరిశ్రమల్లో Fire Safety అవగాహన విస్తరణకు సూచనలు ఇవ్వాల‌ని స్ప‌ష్టం చేశారు .