newsseals.com
News

బీఆర్ఎస్ పార్టీపై భ‌గ్గుమ‌న్న ఎంఐఎం చీఫ్

VijayaBhaskar May 13, 2026
newsseals-MPOwaii
Spread the love

ఆనాడు మీ హ‌యాంలో జ‌రిగితే చ‌ర్య‌లు తీసుకున్నారా

హైద‌రాబాద్ : తెలంగాణ రాష్ట్రంలో ప్ర‌స్తుతం హాట్ టాపిక్ గా మారింది బీజేపీకి చెందిన కేంద్ర హోం శాఖ స‌హాయ మంత్రి బండి సంజ‌య్ కుమార్ ప‌టేల్. ఆయ‌న సుపుత్రుడు బండి భ‌గీర‌థ్ చేసిన నిర్వాకం ప‌ట్ల మ‌హిళ‌లు, ప్ర‌జా సంఘాలు, ప్ర‌తిప‌క్షాలు భ‌గ్గుమంటున్నాయి. త‌ను ఓ మైన‌ర్ బాలిక‌ను మోసం చేశాడు. ఆపై వాడుకుని వ‌దిలేశాడ‌ని మండిప‌డ్డారు. ఇదే స‌మ‌యంలో బాధితురాలి త‌ల్లి నేరుగా పోలీస్ స్టేష‌న్ ను ఆశ్ర‌యించింది. దీ మేర‌కు బండి కొడుకుపై పోక్సో కేసు న‌మోదైంది. ఇప్ప‌టి వ‌ర‌కు త‌ను దొర‌క‌కుండా త‌ప్పించు కోవ‌డం ప‌లు అనుమానాల‌కు తావిస్తోంది. ఈ త‌రుణంలో రాష్ట్ర ప్ర‌భుత్వంపై కూడా పెద్ద ఎత్తున విమ‌ర్శ‌లు రావ‌డంతో చావు క‌బురు చ‌ల్ల‌గా చెప్పారు సీఎం రేవంత్ రెడ్డి. కేసు న‌మోదు అయిన కొన్ని రోజుల త‌ర్వాత నిద్ర లేచారు. సిట్ ను ఏర్పాటు చేస్తున్న‌ట్లు ప్ర‌క‌టించారు.

దీనిపై తీవ్రంగా స్పందించారు ఎంఐఎం చీఫ్ , హైద‌రాబాద్ ఎంపీ అస‌దుద్దీన్ ఓవైసీ. ప్రస్తుతం పార్టీ తరపున మాట్లాడుతున్న వారి జ్ఞాపకశక్తి మందగించినట్లు కనిపిస్తోంది కాబట్టి, కేసీఆర్ మరోసారి పార్టీ పగ్గాలను తన చేతుల్లోకి తీసుకోవాలని అన్నారు. బిఆర్‌ఎస్ (BRS) అధికారంలో ఉన్న సమయంలోనే, అప్పటి ఒక బోర్డు ఛైర్మన్ కుమారుడు ఇటువంటిదే మరొక కేసులో ప్రమేయం కలిగి ఉన్నారని ఆరోపణలు వచ్చాయని ఆయన గుర్తుచేశారు. ఆ సమయంలో బిఆర్‌ఎస్ ప్రభుత్వం ఎటువంటి చర్యలు తీసుకుందని ఆయన ప్రశ్నించారు.