బండి భ‌గీర‌థ్ బెయిల్ దావాపై హైకోర్టు విచార‌ణ

Spread the love

పోక్సో కేసులో నోటీసులు పంపించిన పోలీసులు

హైద‌రాబాద్ : దేశ వ్యాప్తంగా సంచలనం సృష్టించింది కేంద్ర మంత్రి బండి సంజ‌య్ కొడుకు బండి భ‌గీర‌థ్ పోక్సో కేసు. ఈ కేసులో దర్యాప్తుపై సర్వత్రా ఆసక్తి నెలకొంది. మరో వైపు బండి బగీరథ్ మధ్యంతర బెయిల్ ఇవ్వాలని అభ్యర్థిస్తూ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఈనెల 14న విచార‌ణ‌కు రానుంది హైకోర్టులో. ప్ర‌స్తుతం వ‌రుస సెలవులు ఉన్నాయి. ఇదిలా ఉండ‌గా ఈనెల 8వ తేదిన కరీంనగర్ లో భగీరథ్ పోలీస్ స్టేషన్ లో బాలికపై.. ఆమె తల్లిదండ్రులపై కరీంనగర్ టూ టౌన్ పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశారు.

అదే రోజు సైబరాబాద్ కమిషనర్ పరిధిలోని పేట్ బషీరాబాద్ పోలీస్ స్టేషన్ లో ( తాము నివసించే పరిధి) బండి భగీరథ్ సహా మాజీ జర్నలిస్ట్.. బీజేపీ నేత సంగప్ప పై బాలిక తరుపున ఆమె తల్లి ఫిర్యాదు చేశారు. పోక్సో చట్టం ప్రకారం కేసు నమోదు చేయాలని ఫిర్యాదు చేయగా ఆధారాలు పరిశీలించిన పోలీసులు.. అదే చట్టం ప్రకారం భగీరథ్ పై కేసు నమోదు చేశారు. నిన్న ముఖ్యమంత్రి ఆదేశాలతో డీజీపీ ఈ కేసుపై ప్రత్యేక దృష్టి పెట్టారు.. దర్యాప్తు పర్యవేక్షణ బాధ్యతలు కూకట్ పల్లి డీసీపీ రితిరాజ్ కు అప్పగించారు.. దీంతో ఈ కేసులో విచారణ వేగవంతమైంది.

  • Related Posts

    బీఆర్ఎస్ పార్టీపై భ‌గ్గుమ‌న్న ఎంఐఎం చీఫ్

    Spread the love

    Spread the loveఆనాడు మీ హ‌యాంలో జ‌రిగితే చ‌ర్య‌లు తీసుకున్నారా హైద‌రాబాద్ : తెలంగాణ రాష్ట్రంలో ప్ర‌స్తుతం హాట్ టాపిక్ గా మారింది బీజేపీకి చెందిన కేంద్ర హోం శాఖ స‌హాయ మంత్రి బండి సంజ‌య్ కుమార్ ప‌టేల్. ఆయ‌న సుపుత్రుడు…

    అగ్నిమాపక శాఖకు కొత్త శక్తి : అనిత

    Spread the love

    Spread the loveమ‌రింత స‌మ‌ర్థ‌వంతంగా ప‌ని చేయాలి అమ‌రావ‌తి : అగ్ని మాప‌క శాఖ ప‌నితీరు మ‌రింత మెరుగు ప‌డాల్సిన అవ‌స‌రం ఉంద‌న్నారు రాష్ట్ర హోం , విప‌త్తుల నిర్వ‌హ‌ణ శాఖ మంత్రి వంగ‌ల‌పూడి అనిత‌. అమ‌రావ‌తి స‌చివాల‌యంలో అగ్నిమాపక శాఖపై…

    Leave a Reply

    Your email address will not be published. Required fields are marked *