కార్తీక్ శ‌ర్మ మెరిసినా త‌ప్ప‌ని ఓట‌మి

VijayaBhaskar · May 15, 2026
Spread the love

ల‌క్నో సూప‌ర్ జెయింట్ సూప‌ర్ విక్ట‌రీ

ల‌క్నో : ల‌క్నో వేదిక‌గా జ‌రిగిన లీగ్ మ్యాచ్ లో ల‌క్నో సూప‌ర్ జెయింట్స్ సూప‌ర్ విక్ట‌రీ సాధించింది. చెన్నై సూప‌ర్ కింగ్స్ ప్లే ఆఫ్స్ ఆశ‌ల‌పై నీళ్లు చ‌ల్లింది టోర్నీ నుంచి నిష్క్ర‌మిస్తూ. టాస్ గెలిచిన పంత్ నిర్ణ‌యం మంచిదేన‌ని తేలి పోయింది. ముఖ్యంగా లక్నో బౌల‌ర్లు పూర్తిగా డామినేట్ చేశారు. సీఎస్కే బ్యాట‌ర్ల‌ను క‌ట్ట‌డి చేయడంలో స‌క్సెస్ అయ్యారు. దీంతో నిర్ణీత 20 ఓవ‌ర్ల‌లో సీఎస్కే కేవ‌లం 187 ప‌రుగులు మాత్ర‌మే చేసింది. అనంత‌రం మైదానంలోకి దిగిన ల‌క్నో 16.4 ఓంర్ల‌లోనే ల‌క్ష్యాన్ని ఊదేసింది. ల‌క్నో ఓపెన‌ర్లు ఆకాశ‌మే హ‌ద్దుగా చెల‌రేగాడు. ఫోర్లు, సిక్స‌ర్ల‌తో విరుచుకు ప‌డ్డారు.

మిచెల్ మార్ష్ విధ్వంసానికి బెంబేలెత్తి పోయారు సీఎస్కే బైల‌ర్లు. అన్షుల్ బౌలింగ్ లో 28 ర‌న్స్ పిండుకున్నాడు మార్ష్. త‌ను 90 ప‌రుగులు చేసి ఔట్ అయ్యాడు. ఇంగ్లీష్ త‌న‌కు తోడుగా 38 ర‌న్స్ చేస్తే నికోల‌స్ పూరన్ విజ‌యాన్ని చేకూర్చి పెట్టాడు. అంత‌కు ముందు టాస్ ఓడి పోయి మైదానంలోకి దిగిన చెన్నైకి ఆదిలోనే కెప్టెన్ రుతురాజ్ వికెట్ ను కోల్పోయింది. బాగా ఆడ‌తాడ‌ని అనుకున్న సాంస‌న్ చేతులెత్తేశాడు. త‌ను 20 ప‌రుగులే చేసి చెత్త షాట్ ఆడి వికెట్ పారేసుకున్నాడు. మొదట కార్తీక్‌ శర్మ (42 బంతుల్లో 6 ఫోర్లు, 5 సిక్స్‌లతో 71) మెరుపులకు తోడు ఆఖర్లో శివమ్‌ దూబె (16 బంతుల్లో 3 ఫోర్లు, 2 సిక్స్‌లతో 32 నాటౌట్‌) రాణించడంతో చెన్నై 187/5 స్కోరు చేసింది. ఆకాశ్‌ సింగ్‌ (3/26) చెన్నైని కట్టడిచేశాడు.