అన్ని ప్రయోజనాలు అగ్రవర్ణాల్లోని పేదలకి అందాలి

VijayaBhaskar · May 16, 2026
Spread the love

బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడుతో వల్లపరెడ్డి రవీంద్ర రెడ్డి భేటీ

హైదరాబాద్ : అన్ని ప్రయోజనాలు అగ్రవర్ణాల్లోని పేదలకి అందాలని వల్లపరెడ్డి రవీంద్ర రెడ్డి కోరారు. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రామచంద్రరావుతో తన నివాసంలో ఈ బీ సీ జేఏ సీ చైర్మన్ వల్లపరెడ్డి రవీందర్ రెడ్డి భేటీ అయ్యారు. అగ్రవర్ణ పేదల అభ్యున్నతికై కేంద్రంలో, అన్ని రాష్ట్రాలలో ఈ బీ సీ కమిషన్, ఈ బీ సీ కార్పొరేషన్, ఈ బీ సీ వెల్ఫేర్ డిపార్ట్మెంట్ ఏర్పాటు చేయాలని ఆయన కోరారు. ఈ విషయాన్ని ప్రధాన మంత్రి దృష్టికి తీసుకెళ్ళాలని రామచంద్ర రావుని రవీందర్ రెడ్డి కోరారు.

ఎస్సీ, ఎస్ టీ, బీసీ లకు కల్పిస్తున్న అన్ని ప్రయోజనాలను అగ్రవర్ణాల్లోని పేదలకి వర్తింపజేసేలా చర్యలు తీసుకోవాలని రవీందర్ రెడ్డి తెలిపారు .దీనికి రామచంద్ర రావు సానుకూలంగా స్పందంచారు. అగ్రవర్ణ పేదలను అన్నివిధాలా ఆదుకుంటామని అన్నారు. అలాగే ప్రధాన మంత్రికి లేఖ రాస్తానని రామచంద్ర రావు హామీ ఇచ్చారు. ఇదిలా ఉండ‌గా తాజాగా బీజేపీ చీఫ్ కేంద్ర మంత్రి బండి సంజ‌య్ కుమార్ ప‌టేల్ కొడుకు బండి భ‌గీర‌థ్ విష‌యంపై నోరు జార‌డం తీవ్ర దుమారానికి దారి తీసింది. త‌న‌కు బండికి , పార్టీకి ఏం సంబంధం అంటూ ప్ర‌శ్నించ‌డంతో ప్ర‌జా సంఘాలు, మ‌హిళ‌లు భ‌గ్గుమంటున్నారు. ఎందుకు నోరు మెద‌ప‌డం లేదంటూ నిల‌దీస్తున్నారు.