ప్లే ఆఫ్స్ కు చేరాలంటే క‌ష్ట‌ప‌డాలి

VijayaBhaskar · May 16, 2026
Spread the love

ఆస‌క్తిక‌ర వ్యాఖ్య‌లు చేసిన సంజు శాంస‌న్

ల‌క్నో : ఐపీఎల్ 19వ సీజ‌న్ లో భాగంగా యూపీ రాజ‌ధాని ల‌క్నో వేదిక‌గా జ‌రిగిన కీల‌క లీగ్ మ్యాచ్ లో ఆతిథ్య జ‌ట్టు ల‌క్నో సూప‌ర్ జెయింట్స్ చేతిలో చావు దెబ్బ తిన్న‌ది చెన్నై సూప‌ర్ కింగ్స్. టాస్ గెలిచిన కెప్టెన్ రిష‌బ్ పంత్ టాస్ గెలిచి ఫీల్డింగ్ ఎంచుకున్నాడు. త‌న ప్లాన్ వ‌ర్క‌వుట్ అయ్యింది. నిర్ణీత 20 ఓవ‌ర్ల‌లో 5 వికెట్లు కోల్పోయి 187 ర‌న్స్ చేసింది. అనంత‌రం మైదానంలోకి దిగిన ల‌క్నో సూప‌ర్ కింగ్స్ కేవ‌లం 3 వికెట్లు కోల్పోయి 188 ర‌న్స్ చేసి గ్రాండ్ విక్ట‌రీ న‌మోదు చేసింది. సీఎస్కే ఆశ‌ల‌పై నీళ్లు చ‌ల్లింది ల‌క్నో సూప‌ర్ జెయింట్స్. ఈ సంద‌ర్బంగా భారీ అంచనాలు పెట్టుకున్న సంజు శాంస‌న్ ఆశించిన స్థాయిలో ఆడ‌లేక పోయాడు.

ఈ సంద‌ర్బంగా మ్యాచ్ అనంత‌రం శాంస‌న్ మీడియాతో మాట్లాడాడు. మాకు ఇంకా రెండు మ్యాచ్‌లు మిగిలి ఉన్నాయ‌న్నాడు. ఆ రెండూ మాకు దాదాపు ‘చావో-రేవోస లాంటిద‌న్నాడు.. మేము టాప్ 4కి అర్హత సాధించాలంటే, ఆ రెండు మ్యాచ్‌ల్లోనూ తప్పక గెలవాల్సిన అవ‌స‌రం ఉంద‌న్నాడు. ప్రస్తుతానికి అత్యంత సానుకూల విషయం ఏమిటంటే, మా అర్హత అవకాశాలు ఇంకా మా చేతుల్లోనే ఉన్నాయి. మేము ఈ రెండు మ్యాచ్‌ల్లో గెలిస్తే, అర్హత సాధించగలం. ఒక జట్టుగా, మేము దీన్ని సాధించగలమని బలంగా నమ్ముతున్నామన్నాడు.