అంగ్‌క్రిష్‌ రఘువంశీ సెన్సేష‌న్ ఇన్నింగ్స్

Spread the love

44 బంతులు 4 ఫోర్లు 7 సిక్స‌ర్లు 82 ప‌రుగులు

కోల్ క‌తా : ఐపీఎల్ మెగా టోర్నీలో కోల్ క‌తా నైట్ రైడ‌ర్స్ చుక్క‌లు చూపించింది గిల్ సార‌థ్యంలోని గుజ‌రాత్ టైటాన్స్ కు. తాడో పేడో తేల్చుకోవాల్సిన స‌మ‌యంలో స‌త్తా చాటింది. త‌ను కూడా మిగ‌తా జ‌ట్ల‌తో పాటు ప్లే ఆఫ్స్ రేసులో ఉన్నాన‌ని ప్ర‌క‌టించింది. వ‌రుస‌గా 5 విజ‌యాల‌తో దూసుకు పోతున్న గుజ‌రాత్ టైటాన్స్ కు బ్రేక్ వేసింది కేకేఆర్. ముందుగా మైదానంలోకి దిగిన కోల్ క‌తా ఆకాశ‌మే హ‌ద్దుగా ఆడింది. ఆ జ‌ట్టుకు చెందిన కెప్టెన్ అజింక్యా ర‌హానే త్వ‌ర‌గా వెనుదిరిగినా ఎక్క‌డా త‌గ్గ‌లేదు కోల్ క‌తా ప్లేయ‌ర్లు. గుజ‌రాత్ బౌల‌ర్ల‌ను చెడుగుడు ఆడారు. చుక్క‌లు చూపించారు ఫిన్ అలెన్ , యంగ్ క్రికెట‌ర్ అంగ్ క్రిష్ ర‌ఘువంశీ. ప్రారంభం నుంచే దంచి కొట్ట‌డం స్టార్ట్ చేశారు.

దీంతో బెంబేలెత్తి పోయారు. ఏం చేయాలో తోచ‌క నిల‌బ‌డి చూస్తుండి పోయారు. విచిత్రం ఏమిటంటే ఫీల్డింగ్ ప‌రంగా కూడా కొన్ని చేసిన పొర‌పాట్లు గుజ‌రాత్ పాలిట శాపంగా మారింది. ఇక మ్యాచ్ విష‌యానికి వ‌స్తే ఫిన్ అలెన్ 35 బంతులు ఆడి 4 ఫోర్లు 10 సిక్స‌ర్ల‌తో 93 ర‌న్స్ చేస్తే ర‌ఘువంశీ 44 బంతులు ఆడి 4 ఫోర్లు 7 సిక్స‌ర్ల‌తో 82 ప‌రుగులు చేసి నాటౌట్ గా నిలిచాడు. కేమ‌రూన్ కూడా స‌త్తా చాటాడు. త‌ను కూడా ఫోర్లు, సిక్స‌ర్ల‌తో విరుచుకుప‌డ్డాడు. దీంతో భారీ ల‌క్ష్యాన్ని నిర్దేశించింది గుజ‌రాత్ టైటాన్స్ ముందు. అనంత‌రం గుజ‌రాత్ టైటాన్స్ సైతం భారీ ఎత్తున పోరాడేందుకు ప్ర‌య‌త్నించింది. గిల్ , బ‌ట్ల‌ర్, సాయి సుద‌ర్శ‌న్ ఆడినా ఫ‌లితం లేకుండా పోయింది.

  • Related Posts

    ప్లే ఆఫ్స్ కు చేరాలంటే క‌ష్ట‌ప‌డాలి

    Spread the love

    Spread the loveఆస‌క్తిక‌ర వ్యాఖ్య‌లు చేసిన సంజు శాంస‌న్ ల‌క్నో : ఐపీఎల్ 19వ సీజ‌న్ లో భాగంగా యూపీ రాజ‌ధాని ల‌క్నో వేదిక‌గా జ‌రిగిన కీల‌క లీగ్ మ్యాచ్ లో ఆతిథ్య జ‌ట్టు ల‌క్నో సూప‌ర్ జెయింట్స్ చేతిలో చావు…

    ల‌క్నో మా కంటే బాగా ఆడింది : రుతురాజ్ గైక్వాడ్

    Spread the love

    Spread the loveప్లే ఆఫ్స్ కు చేరాలంటే మిగ‌తా రెండూ గెల‌వాలిల‌క్నో : చెన్నై సూప‌ర్ కింగ్స్ జ‌ట్టు కెప్టెన్ రుతురాజ్ గైక్వాడ్ ఆస‌క్తిక‌ర వ్యాఖ్య‌లు చేశాడు. ల‌క్నో చేతిలో 7 వికెట్ల తేడాతో ఓడి పోవ‌డం ప‌ట్ల నిరాశ వ్య‌క్తం…

    Leave a Reply

    Your email address will not be published. Required fields are marked *