చెన్నై హైద‌రాబాద్ మ‌హా సంగ్రామానికి రెఢీ

Spread the love

ఇరు జ‌ట్ల‌కు ఐపీఎల్ లీగ్ మ్యాచ్ కీల‌కం

చెన్నై : ఐపీఎల్ 19 మెగా టోర్నీ అంత‌కంత‌కూ ర‌స‌వ‌త్త‌రంగా మారింది. ప్లే ఆఫ్స్ కు చేరుకోవాలంటే సోమ‌వారం చెన్నైలో జ‌రిగే కీల‌క లీగ్ మ్యాచ్ లో త‌ప్ప‌నిస‌రిగా గెల‌వాల్సి ఉంది చెన్నై సూప‌ర్ కింగ్స్ కు. రూ. 18 కోట్లు పోసి కొనుగోలు చేసిన ఓపెన‌ర్ సంజు శాంస‌న్ ఆట‌తీరు పేల‌వంగా ఉంది. త‌ను అడ‌పా ద‌డ‌పా ఆడుతున్నాడే త‌ప్పా ఆశించిన మేర రాణించ‌డం లేదు. మ‌రో వైపు జ‌ట్టు కెప్టెన్ రుతురాజ్ గైక్వాడ్ టీంకు భారంగా మారాడు. ఇక సీఎస్కేకు ప్ర‌ధాన ఆట‌గాళ్లు గాయాల బారిన ప‌డ‌డం కూడా స‌మ‌స్య‌గా మారింది. ఇదే స‌మ‌యంలో త‌ళా మ‌హేంద్ర సింగ్ ధోనీ ఈ మ్యాచ్ లో ఆడ‌తాడ‌ని పెద్ద ఎత్తున ప్ర‌చారం జ‌రుగుతోంది.

మ‌రో వైపు స‌న్ రైజ‌ర్స్ హైద‌రాబాద్ అటు బ్యాటింగ్ లో ఇటు బౌలింగ్ లో బ‌లంగా ఉంది. ఈ మ్యాచ్ లో గెలిస్తేనే ప్లే ఆఫ్స్ రేసుపై ఆశ‌లు పెట్టుకోవాల్సి ఉంటుంది రుతురాజ్ గైక్వాడ్ సేన‌కు. ప్ర‌ధానంగా సంజు శాంస‌న్ రాణించ‌డంపైనే జ‌ట్టు విజ‌యం ఆధార‌ప‌డింది. తాజాగా అందిన స‌మాచారం మేరకు చెన్నై సూపర్ కింగ్స్ తుది జట్టులో రెండు మార్పులు చోటు చేసుకోనున్నాయి. మళ్ళీ అకేల హుస్సేన్‌ను తుది ఎంపిక చేశారు. ఎం.ఎస్. ధోని చెపాక్‌లో తన చివరి మ్యాచ్ ఆడబోతున్నాడు. అతను ‘ఇంపాక్ట్ ప్లేయర్’గా బరిలోకి దిగనున్నాడు. త‌న‌కు వీడ్కోలు ప‌ల‌క‌నున్నారు. ఇందుకోసం పలువురు మాజీ క్రికెటర్లు ఇప్పటికే చెపాక్‌కు చేరుకున్నారు.

  • Related Posts

    రియాన్ పరాగ్ పై కుమార సంగక్కర ఆగ్రహం

    Spread the love

    Spread the loveఢిల్లీ క్యాపిట‌ల్స్ చేతిలో 5 వికెట్ల తేడాతో ఓట‌మి న్యూఢిల్లీ : ఐపీఎల్ మెగా టోర్నీలో ప్లే ఆఫ్స్ రేసు లో నిలిచేందుకు జ‌రిగిన కీల‌క మ్యాచ్ లో అక్ష‌ర్ ప‌టేల్ సార‌థ్యంలోని ఢిల్లీ క్యాపిట‌ల్స్ అద్బుత విజ‌యాన్ని…

    రాజ‌స్తాన్ రాయ‌ల్స్ ను శాసించిన మిచెల్ స్టార్క్

    Spread the love

    Spread the love4 ఓవ‌ర్లు 40 ప‌రుగులు 4 వికెట్లు 9 డాట్ బాల్స్ న్యూఢిల్లీ : ఐపీఎల్ 19వ సీజ‌న్ లో ప్లే ఆఫ్స్ రేసులో నిల‌వాల‌ని , ఈసారి క‌ప్పు ఎగురేసుకు పోవాల‌ని క‌ల‌లు కంటున్న రాజ‌స్తాన్ రాయ‌ల్స్…

    Leave a Reply

    Your email address will not be published. Required fields are marked *