ఐపీఎల్ గవర్నింగ్ బాడీకి మేనేజ్మెంట్ పై ఫిర్యాదు
చెన్నై : ఐపీఎల్ 19 సీజన్ లో ఆశించిన రీతిలో ఆడలేక పోయింది భారీ ఫ్యాన్స్ ను కలిగి ఉన్న చెన్నై సూపర్ కింగ్స్. ఈసారి తళా ఎంఎస్ ధోనీ మైదానంలో అడుగు పెట్టలేక పోయాడు. ఇక మ్యాచ్ విషయానికి వస్తే సీఎస్కే స్కిప్పర్ రుతురాజ్ గైక్వాడ్ టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకోవడం కొంప ముంచేలా చేసింది. ఎస్ఆర్ హెచ్ బౌలర్లు ప్రధానంగా కెప్టెన్ పాట్ కమిన్స్ అద్భుతంగా బౌలింగ్ చేశాడు. సీఎస్కే టాప్ ఆర్డర్ ను ముప్పు తిప్పలు పెట్టాడు. దీంతో నిర్ణీత 20 ఓవర్లలో 181 రన్స్ చేసింది. అనంతరం సన్ రైజర్స్ 19 ఓవర్లలోనే పని కానిచ్చేసింది. స్టార్ ప్లేయర్ ఇషాన్ కిషన్ అద్భుతమైన ఇన్నింగ్స్ తో ఆకట్టుకున్నాడు. తను కీలకంగా మారడంతో ఎస్ ఆర్ హెచ్ గట్టెక్కింది. సీఎస్కే ప్లే ఆఫ్స్ రేసు ఆశలపై నీళ్లు చల్లింది.
ఇదిలా ఉండగా విజయం అనంతరం ఇషాన్ కిషన్ ప్రవర్తించిన తీరు ఇప్పుడు దేశ వ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది. తను సీఎస్కే ఫ్యాన్స్ నిత్యం ఉపయోగించే విజిల్ పోడు ను తను అనుకరించాడు. ఆపై స్టేడియంలో ఉన్న అభిమానులను ఉద్దేశించి ఇక వెళ్లి పోండి అంటూ సైగలు చేశాడు. ఇందుకు సంబంధించిన ఫోటోలు, వీడియోలు వైరల్ అయ్యాయి. ఎంఎస్ ధోనీ వీడ్కోలు సందర్భంగా ఇషాన్ కిషన్ ట్రోల్ చేయడం పట్ల సర్వత్రా ఆగ్రహం వ్యక్తం అవుతోంది. తనపై చర్యలు తీసుకోవాలని, ఇంకోసారి ఇలా చేయొద్దంటూ సూచించారు.






