బాగానే ఆడాం కానీ ఓడి పోయాం : రుతురాజ్ గైక్వాడ్

స‌న్ రైజ‌ర్స్ హైద‌రాబాద్ చేతిలో 5 వికెట్ల తేడాతో ఓట‌మి

చెన్నై : ఐపీఎల్ మెగా టోర్నీలో భాగంగా చెన్నై వేదిక‌గా జ‌రిగిన కీల‌క మ్యాచ్ లో చెన్నై సూప‌ర్ కింగ్స్ ఆశ‌ల‌పై నీళ్లు చ‌ల్లింది స‌న్ రైజ‌ర్స్ హైద‌రాబాద్. 5 వికెట్ల తేడాతో ఓడించింది. దీంతో ప్లే ఆఫ్స్ రేసు నుంచి దాదాపుగా నిష్క్ర‌మించింది సీఎస్కే. ప్ర‌ధానంగా ఈసారి భారీ ధ‌ర‌కు కొనుగోలు చేసిన సంజు శాంస‌న్ ఆట తీరు కూడా నిరాశ ప‌ర్చ‌గా కెప్టెన్ రుతురాజ్ పేల‌వ‌మైన ప‌ర్ ఫార్మెన్స్ ఆ జ‌ట్టును నిర్వీర్య ప‌రిచేలా చేసింది. ఈ త‌రుణంలో సీఎస్కే ఓడి పోయిన అనంత‌రం మీడియాతో మాట్లాడారు కెప్టెన్ గైక్వాడ్. ఇది ఒక మంచి క్రికెట్ మ్యాచ్. ఇది ఒక మంచి టీ20 పిచ్, పెద్దగా మార్పులేమీ రాలేదు. కొన్ని అవకాశాలను కోల్పోయాం అన్నాడు.

అయినా మా కుర్రాళ్ల గురించి గర్వంగా ఉంది. ప్రత్యర్థి వికెట్ కోల్పోయిన తర్వాత వచ్చిన అవకాశాన్ని మేము సద్వినియోగం చేసుకోవాల్సింది, కానీ అలా చేయలేక పోయాం. అయినా కూడా చాలా సానుకూల అంశాలు ఉన్నాయి. సంజు సామ్సన్ మా కోసం చాలా బాగా ఆడుతున్నాడు. గాయాల కారణంగా కొందరు కీలక ఆటగాళ్లను కోల్పోయాం. ఈరోజు ప్రతి ఒక్కరూ తమ శక్తిమేర ఆడారు, మా కుర్రాళ్ల గురించి గర్వంగా ఉంది. అభిమానులు కష్టసుఖాల్లో మాకు అండగా ఉన్నార‌న్నాడు. గత ఏడాదితో పోలిస్తే ఈ ఏడాది మేము చాలా మెరుగ్గా ఆడామన్నాడు రుతురాజ్ గైక్వాడ్.

  • Related Posts

    వైభ‌వ్ సూర్య‌వంశీ ఎంపిక క‌రెక్టు కాదు

    హైద‌రాబాద్ : ప్ర‌ముఖ క్రికెట్ అనలిస్ట్, కామెంటేట‌ర్ హ‌ర్ష భోగ్లే సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేశారు. ఇంగ్లండ్ టూర్ లో భాగంగా శ్రేయ‌స్ అయ్య‌ర్ నాయ‌క‌త్వంలో టీమిండియా టి20 సీరీస్ ను కోల్పోయింది. ఆఖ‌రి మ్యాచ్ లోనూ చేతులెత్తేశారు. ప్ర‌ధాన ఆట‌గాళ్లు ఆశించిన…

    వ‌చ్చే ఐపీఎల్ సీజ‌న్ లో ఎంఎస్ ధోనీ ఆడ‌టం క‌ష్ట‌మే

    చెన్నై : భార‌త దేశ క్రికెట్ రంగంలో అత్యంత జ‌నాద‌ర‌ణ పొందిన ఏకైక క్రికెట‌ర్ జార్ఖండ్ డైన‌మెట్ మ‌హేంద్ర సింగ్ ధోనీ. త‌న సార‌థ్యంలో చెన్నై సూప‌ర్ కింగ్స్ ప‌లుమార్లు ఐపీఎల్ టైటిళ్ల‌ను స్వంతం చేసుకుంది. ప‌లువురిని మార్చింది సీఎస్కే యాజ‌మాన్యం.…

    Leave a Reply

    Your email address will not be published. Required fields are marked *