Friday, 16 October 2026

బాబు హ‌యాంలోనే మా తాత‌ను చంపారు

newsseals-YSjaganSlams

ఫ్యాక్ష‌న్ రాజ‌కీయాల‌కు పెట్టింది పేరు బాబు

అమ‌రావ‌తి : రాష్ట్రంలో ఫ్యాక్ష‌న్ రాజ‌కీయాల‌కు తెర లేపింది చంద్ర‌బాబు నాయుడు అని సంచ‌ల‌న ఆరోప‌ణ‌లు చేశారు మాజీ సీఎం జ‌గ‌న్ రెడ్డి. మా తాత రాజారెడ్డిని చంపింది ఎవ‌రు..టీడీపీ వాళ్లు కాదా , నువ్వు సీఎంగా ఉన్న‌ప్పుడే క‌దా ఇది జ‌రిగింది. ఆ విష‌యం రాష్ట్ర ప్ర‌జ‌లంద‌రికీ తెలుసన్నారు. 1999 అసెంబ్లీ ఎన్నికలకు ఏడాది ముందు రాజారెడ్డిని అత్యంత దారుణంగా చంపేశార‌ని వాపోయారు. రాజశేఖరరెడ్డిని కేవలం పులివెందులకు కట్టడి చేసి, రాజకీయంగా లబ్ధి పొందాలన్నది ఇందుల్లో ఉన్న రాజకీయ కోణం అన్నారు. రాజారెడ్డి కేసులో దోషులను హైదరాబాద్‌ తెలుగుదేశం పార్టీ సెంట్రల్‌ ఆఫీసు, ఎన్టీఆర్‌ ట్రస్ట్‌ భవన్‌లో పెట్టి, అధికార దుర్వినియోగం చేసి, వారిని రక్షించింది ఎవరు? మరి ఎవరిది క్రిమినల్‌ బ్రెయిన్‌? అని ప్ర‌శ్నించారు.

హత్యలతో, వెన్నుపోట్లతో, శవాలతో రాజకీయాలు చేసింది, చేస్తున్నది చంద్రబాబు అయితే, విలువలు, విశ్వసనీయత, మాటకు కట్టుబడి రాజకీయాలు చేస్తున్నది మేం అని ప్ర‌క‌టించారు. జగన్‌ మంచివాడు కాబట్టే, మా తాతను చంపిన వాళ్లుకూడా ప్రశాంతంగా ఉన్నారు. జగన్‌ చెడ్డోడు అయితే వాళ్లు ప్రశాంతంగా ఉండేవాళ్లా? జగన్‌ నైజం ఎలాంటిది? మనస్తత్వం ఎలాంటిది చెప్పడానికి ఇది నిద్శనం అన్నారు. ప్రజలకు మంచి చేసి పేరు తెచ్చుకోవాలని మా నాన్న నేర్పించాడు. చంద్రబాబులా కాదు. రాజకీయాల్లో ఎవరికి కుట్రలు అవసరమో, ఎవరికి గొడ్డళ్లు, గునపాలు అవసరమో ప్రజలకు బాగా తెలుసు అన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *