ఆ ఫొటోలు నావి కావు అవ‌న్నీ ఫేక్

న‌టి రుక్మిణి వ‌సంత్ షాకింగ్ కామెంట్స్

బెంగ‌ళూరు : క‌న్న‌డ చ‌ల‌న చిత్ర ప‌రిశ్ర‌మ‌కు చెందిన ప్ర‌ముఖ న‌టి రుక్మిణి వ‌సంత్ సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేశారు. సోష‌ల్ మీడియా వేదిక‌గా త‌న పేరుతో న‌కిలీ వీడియోలు, ఫోటోలు, ఫేక్ ఐడీల‌తో ద‌ర్శ‌నం ఇస్తున్నాయ‌ని వాపోయింది. శ‌నివారం ఈ మేర‌కు కీల‌క ప్ర‌క‌ట‌న చేసింది న‌టి. తన డీప్ ఫేక్ AI వీడియోలపై హీరోయిన్ రుక్మిణీ వసంత్ ఆగ్రహం వ్య‌క్తం చేసింది. తాను బికినీతో స్విమ్మింగ్ పూల్లో దిగుతున్నట్లుగా డీప్ ఫేక్ వీడియోలు క్రియేట్ చేయడంపై హీరోయిన్ ఫైర్ అయ్యింది. ఇలాంటి నకిలీ కంటెంట్‌ను సృష్టించడం ప్రైవసీ భంగం కలిగించడమే అవుతుద‌ని హెచ్చ‌రించింది.

అలా చేసే వ్యక్తులపై చట్టపరమైన చర్యలు తీసుకుంటాన‌ని వార్నింగ్ ఇచ్చింది న‌టి రుక్మిణి వ‌సంత్.
ఇది మంచి ప‌ద్ద‌తి కాద‌ని పేర్కొంది. ఇలాంటి వాటి వ‌ల్ల వ్య‌క్తిగ‌తంగా ఇబ్బంది ఏర్ప‌డుతుంద‌ని వాపోయింది. ఇక నుంచైనా ఎవ‌రైనా ఫేక్ ఏఐ వీడియోలు త‌యారు చేసినా లేదా ప్ర‌చురించినా, ప్ర‌సారం చేసినా చ‌ర్య‌లు త‌ప్ప‌వ‌ని పేర్కొంది న‌టి. ఇదిలా ఉండ‌గా రుక్మిణి వ‌సంత్ స్వ‌స్థ‌లం బెంగ‌లూరు. త‌ను డిసెంబ‌ర్ 10, 1996లో పుట్టింది. తండ్రి అశోక్ చ‌క్ర అవార్డు గ్ర‌హీత‌, త‌ల్లి సామాజిక సేవ‌కురాలు. ఇక రుక్మిణి వ‌సంత్ క‌న్న‌డ‌, తెలుగు, త‌మిళ సినిమాల్లో న‌టిస్తున్నారు.

  • Related Posts

    రూ. 40 కోట్ల‌కు చేరువ‌గా అఖిల్, బోర్సే లెనిన్ మూవీ

    హైద‌రాబాద్ : అక్కినేని నాగార్జున త‌న‌యుడు అఖిల్ అక్కినేని , అందాల తార భాగ్య‌శ్రీ బోర్సే క‌లిసి న‌టించిన తాజా చిత్రం లెనిన్ దుమ్ము రేపుతోంది. అన్ని వ‌ర్గాల ప్రేక్ష‌కుల‌ను ఆకట్టుకుంటోంది. ఈ సినిమా జూలై 10న శుక్ర‌వారం ప్ర‌పంచ వ్యాప్తంగా…

    ప‌ట్టుద‌ల‌తో న‌టిగా ప్రూవ్ చేసుకున్న భాగ్య‌శ్రీ భోర్సే

    హైద‌రాబాద్ : ముంబైకి చెందిన భాగ్య‌శ్రీ బోర్సే ఎట్ట‌కేల‌కు త‌ను న‌టిగా ప్రూవ్ చేసుకున్నారు. మిస్ట‌ర్ బ‌చ్చ‌న్ తో ఆశించిన స‌క్సెస్ రాక పోయినా ఆ త‌ర్వాత కొన్ని చిత్రాల‌లో న‌టించినా జ‌నం ఆద‌రించ‌లేదు. కానీ తాజాగా అన్న‌పూర్ణ స్టూడియోస్, సితార…

    Leave a Reply

    Your email address will not be published. Required fields are marked *