ఢిల్లీకి బ‌య‌లు దేరిన సీఎం జోసెఫ్ విజ‌య్

Spread the love

ప్ర‌ధానితో పాటు సోనియా, రాహుల్ తో భేటీ

చెన్నై : త‌మిళ‌నాడు రాష్ట్ర ముఖ్య‌మంత్రి జోసెఫ్ విజ‌య్ చంద్ర‌శేఖ‌ర్ బుధ‌వారం ఢిల్లీకి బ‌య‌లుదేరి వెళ్లారు. ఆయ‌న సీఎంగా కొలువు తీరిన త‌ర్వాత తొలిసారిగా దేశ రాజ‌ధానికి వెళ్ల‌డం. ఇప్ప‌టికే దేశ వ్యాప్తంగా జోసెఫ్ విజ‌య్ సంచ‌ల‌నం సృష్టించారు. ఆయ‌న కేవ‌లం పార్టీ పెట్టిన 2 సంవ‌త్స‌రాల కాల వ్య‌వ‌ధిలో రాష్ట్రంలో అత్య‌ధిక మెజారిటీ సీట్ల‌ను సాధించి చ‌రిత్ర సృష్టించారు. ప‌లు పార్టీల మ‌ద్ద‌తుతో క‌లిసి కొత్త‌గా టీవీకే ఆధ్వ‌ర్యంలో కూట‌మి ప్ర‌భుత్వాన్ని ఏర్పాటు చేశారు. ఆయ‌న సంచ‌ల‌న నిర్ణ‌యాలు తీసుకుంటూ పాల‌నా ప‌రంగా త‌న‌దైన ముద్ర వేశారు. వ‌చ్చీ రావ‌డంతోనే అక్ర‌మార్కుల‌కు చెక్ పెట్టారు. ప్ర‌ధానంగా ఆయ‌న తీసుకున్న నిర్ణ‌యం రాష్ట్ర వ్యాప్తంగా మ‌ద్ద‌తు ల‌భిస్తోంది. ప్రార్థ‌నా మందిరాళ్లు, ఆల‌యాలు, స్కూళ్ల‌కు కిలో మీట‌ర్ దూరంలో మ‌ద్యం షాపులు ఉండాల‌ని ఆదేశించారు.

అంతే కాదు మాద‌క ద్ర‌వ్యాల ప‌ట్ల కూడా క‌ఠినంగా వ్య‌వ‌హ‌రించారు. ఇదే స‌మ‌యంలో అత్యంత కీల‌క‌మైన ఇంటెలిజెన్స్ శాఖ‌కు అత్యంత నిజాయితీ, నిబ‌ద్ద‌త క‌లిగిన , పేరు మోసిన సీనియ‌ర్ పోలీస్ ఆఫీస‌ర్ ఆస్రా గార్గ్ ను చీఫ్ గా నియ‌మించారు. అంతే కాదు గ‌త ప్ర‌భుత్వంలో అవినీతి అక్ర‌మాల‌కు తెర లేపిన సెంథిల్ బాలాజీ పై విచార‌ణ‌కు ఆదేశించారు. అవినీతి ర‌హిత పాల‌న అందిస్తాన‌ని ప్ర‌క‌టించారు. అంతే కాదు అంద‌రికంటే ముందుగా స‌చివాల‌యానికి వ‌స్తున్నారు. దీంతో ఉద్యోగుల‌లో కూడా ద‌డ పుడుతోంది. ఇక ఆయ‌న ఢిల్లీలో ప్ర‌ధాని మోదీతో భేటీ అవుతారు. అనంత‌రం కాంగ్రెస్ అగ్ర నాయ‌కులు సోనియా, ఖ‌ర్గే, రాహుల్ , ప్రియాంక గాంధీల‌తో స‌మావేశం కానున్నారు.

  • Related Posts

    ‘స‌ర్ ‘పై ఈసీ నిర్ణ‌యం సరైన‌దే : సుప్రీంకోర్టు

    Spread the love

    Spread the loveసంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేసిన ధ‌ర్మాస‌నం న్యూఢిల్లీ : భార‌త దేశ స‌ర్వోన్న‌త ప్ర‌ధాన న్యాయ‌స్థానం సుప్రీంకోర్టు సంచ‌ల‌న ప్ర‌క‌ట‌న చేసింది. స‌ర్ పై పెద్ద ఎత్తున ఆందోళ‌న‌లు వ్య‌క్తం అవుతున్నాయి. ఎస్ఐఆర్ నిర్వహించేందుకు ఈసీకి ఉన్న అధికారాన్ని సుప్రీంకోర్టు…

    ఓలెక్ట్రా ఎలక్ట్రిక్ బస్సుల ప్రత్యేకతలు ఇవే

    Spread the love

    Spread the loveసులభంగా ఎక్కడానికి, దిగడానికి వీలుగా డిజైన్ హైద‌రాబాద్ : ఓలెక్ట్రా విద్యుత్ బ‌స్సులు మ‌రో 60 టీఎస్ఆర్టీసీకి చేరుకున్నాయి. దీంతో మొత్తం 500 బ‌స్సులు ఇచ్చిన‌ట్ల‌యింది. ఇక ఈ బ‌స్సుల విష‌యానికి వ‌స్తే దీని ప్ర‌త్యేక‌త‌లు ఆక‌ట్టుకుంటున్నాయి. వీటిని…

    Leave a Reply

    Your email address will not be published. Required fields are marked *