‘స‌ర్ ‘పై ఈసీ నిర్ణ‌యం సరైన‌దే : సుప్రీంకోర్టు

సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేసిన ధ‌ర్మాస‌నం

న్యూఢిల్లీ : భార‌త దేశ స‌ర్వోన్న‌త ప్ర‌ధాన న్యాయ‌స్థానం సుప్రీంకోర్టు సంచ‌ల‌న ప్ర‌క‌ట‌న చేసింది. స‌ర్ పై పెద్ద ఎత్తున ఆందోళ‌న‌లు వ్య‌క్తం అవుతున్నాయి. ఎస్ఐఆర్ నిర్వహించేందుకు ఈసీకి ఉన్న అధికారాన్ని సుప్రీంకోర్టు ఇవాళ‌ సమర్థించింది. అసోసియేషన్ ఫర్ డెమోక్రటిక్ రిఫార్మ్స్ అనే ఎన్జీఓ దాఖలు చేసిన పిటిషన్‌తో సహా పలు పిటిషన్లపై సుప్రీంకోర్టు తన తీర్పును రిజర్వ్ చేసింది. ఓటర్ల జాబితాలపై స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ (స‌ర్) ప్రక్రియను నిర్వహించేందుకు భారత ఎన్నికల సంఘానికి ఉన్న అధికారాన్ని సుప్రీంకోర్టు ఓకే చెప్పింది. ఇది స్వేచ్ఛాయుత, నిష్పక్షపాత ఎన్నికల రాజ్యాంగ ఆవశ్యకతను ముందుకు తీసుకువెళుతుంది అని పేర్కొంది. ఎస్ఐఆర్ నిర్వహించడం ద్వారా ఎన్నికల సంఘం తన చట్టబద్ధమైన అధికారాలకు వెలుపల వ్యవహరించిందని చెప్పలేమని ప్రధాన న్యాయమూర్తి సూర్యకాంత్ నేతృత్వంలోని ధర్మాసనం వ్యాఖ్యానించింది.

కేవలం పరిపాలనా సౌలభ్యం కోసం మాత్రమే ఈ ప్రక్రియను చేపట్టారని తాము నిర్ధారించ లేక పోతున్నామని పేర్కొంది ధ‌ర్మాస‌నం. దీనికి విరుద్ధంగా, ఎన్నికల ఎస్ఐఆర్ స్వేచ్ఛాయుత, నిష్పక్షపాత ఎన్నికల రాజ్యాంగ ఆవశ్యకతను ముందుకు తీసుకు వెళుతుందని తాము భావిస్తున్న‌ట్లు తెలిపింది. రాజ్యాంగంలోని ఆర్టికల్ 326, ప్రజా ప్రాతినిధ్య చట్టం, 1950 దాని కింద చేసిన నిబంధనల ప్రకారం విస్తృత స్థాయిలో ఎస్ఐఆర్ (SIR)ను నిర్వహించడానికి ఎన్నికల సంఘానికి అధికారాలు లేవని ఎస్ఐఆర్ ను సవాలు చేస్తూ దాఖలైన పిటిషన్లలో పేర్కొన్నారు. జనవరి 29న, అసోసియేషన్ ఫర్ డెమోక్రటిక్ రిఫార్మ్స్ (ADR) అనే ఎన్జీఓ దాఖలు చేసిన పిటిషన్‌తో సహా, ఈ పిటిషన్లపై సుప్రీంకోర్టు తన తీర్పును రిజర్వ్ చేసింది.

  • Related Posts

    ప్రధాని మోదీతో ఇరాన్ ప్రెసిడెంట్ పెజెష్కియన్ భేటీ

    టెహ్రాన్ : ఇరాన్ అధ్యక్షుడు ప్రధాని మోదీ, పాకిస్థాన్ ప్రధాని షెహబాజ్ షరీఫ్ , కిర్గిజ్‌స్థాన్, రష్యా, తజికిస్థాన్ అధ్యక్షులతో సహా పలువురు పాల్గొనే నాయకులతో ద్వైపాక్షిక సమావేశాలు నిర్వహిస్తారు. కిర్గిజ్‌స్థాన్‌లో రెండు రోజుల పర్యటనలో భాగంగా ఇరాన్ అధ్యక్షుడు మసూద్…

    వెలిగొండ ప్రాజెక్ట్ ప్రారంభం చారిత్రాత్మక ఘట్టం

    అమరావ‌తి : వెలిగొండ ప్రాజెక్ట్ ప్రారంభోత్సవం చారిత్రాత్మక ఘట్టం అని పేర్కొన్నారు మంత్రి మండిప‌ల్లి రాంప్ర‌సాద్ రెడ్డి. సాగునీటి ప్రాజెక్టుల పూర్తికి సీఎం చంద్రబాబు ప్రత్యేక చొరవతో వెలిగొండను పూర్తి చేసి ప్రజలకు అంకితం చేశార‌న్నారు. ఈ సంద‌ర్బంగా సీఎంకు ధ‌న్య‌వాదాలు…

    Leave a Reply

    Your email address will not be published. Required fields are marked *