ఇప్పటికే ఆర్సీబీ రెండు సార్లు విజేతగా నిలిచింది
అహ్మదాబాద్ : ఐపీఎల్ 19వ సీజన్ టైటిల్ విజేతగా నిలిచింది రజత్ పాటిదార్ నాయకత్వంలోని రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు. గుజరాత్ రాజధాని అహ్మదాబాద్ వేదికగా జరిగిన కీలకమైన ఫైనల్ మ్యాచ్ లో అద్భుతంగా ఆడింది ఆర్సీబీ. ప్రత్యర్థి జట్టు గుజరాత్ ను కేవలం 155 పరుగులకే పరిమితం చేసింది. ప్రధానంగా ఆర్సీబీ బౌలర్లు సలామ్ ధార్ 3 వికెట్లు తీస్తే , భువనేశ్వర్ కుమార్ 2, హేజిల్ వుడ్ 2 వికెట్లు తీశారు. గుజరాత్ టైటాన్స్ జట్టు పతనాన్ని శాసించారు.
అనంతరం బరిలోకి దిగింది ఆర్సీబీ. 18 ఓవర్లలోనే 156 రన్స్ చేసి విజేతగా నిలిచింది. ఇదిలా ఉండగా 18 ఏళ్ల సుదీర్ఘ గ్యాప్ తర్వాత గత ఏడాది 2025లో ఆర్సీబీ రజత్ పాటిదార్ నాయతక్వంలోని ఆర్సీబీ ఐపీఎల్ విజేతగా నిలిచింది. తాజాగా ఈ ఏడాది 2026లో జరిగిన ఐపీఎల్ 19 సీజన్ లో సైతం సత్తా చాటింది. 5 వికెట్ల తేడాతో విజయం సాధించింది. రన్ మెషీన్ విరాట్ కోహ్లీ 42 బంతులు ఎదుర్కొని 9 ఫోర్లు 3 సిక్సర్లతో 75 పరుగులతో నాటౌట్ గా నిలిచాడు. మ్యాచ్ అనంతరం కోహ్లీ మీడియాతో మాట్లాడాడు. వరుసగా రెండుసార్లు ఐపీఎల్ టైటిళ్లను గెలుచుకున్నాం. రాబోయే వచ్చే ఏడాది 2027లో కూడా కప్పుగెలవాలని ఉంది. హ్యాట్రిక్ సాధిస్తామన్న నమ్మకాన్ని వ్యక్తం చేశాడు కోహ్లీ.





