ముంబై ఇండియ‌న్స్ తోనే సూర్య కుమార్ యాద‌వ్

VijayaBhaskar · June 10, 2026
Spread the love

స్ప‌ష్టం చేసిన ముంబై ఇండియ‌న్స్ యాజ‌మాన్యం

ముంబై : ఐపీఎల్ 19 సీజ‌న్ లో ముంబై ఇండియ‌న్స్ జ‌ట్టు దారుణ‌మైన ప్ర‌ద‌ర్శ‌న తో తీవ్ర నిరాశ ప‌రిచింది. పాయింట్ల ప‌ట్టిక‌లో చివ‌రి స్థానంలో నిలిచింది. దిగ్గ‌జ ఆట‌గాళ్లు ఉన్న‌ప్ప‌టికీ ఆ జ‌ట్టు ఆశించిన మేర ప్ర‌ద‌ర్శ‌న చేప‌ట్ట‌లేక చ‌తికిల ప‌డింది. గ‌తంలో ప‌లుమార్లు ఛాంపియ‌న్ గా నిలిచింది ముంబై ఇండియ‌న్స్. ప్ర‌స్తుతం ఆ జ‌ట్టుకు కెప్టెన్ గా ఉన్న హార్దిక్ పాండ్యాతో పాటు మాజీ స్కిప్ప‌ర్ సూర్య కుమార్ యాద‌వ్ ల పూర్ ప‌ర్ ఫార్మెన్స్ కార‌ణంగా వేటు వేయ‌నున్న‌ట్లు జోరుగా ప్ర‌చారం జ‌రిగింది. తాజాగా కీల‌క అప్ డేట్ వచ్చింది. పుండు మీద కారం చ‌ల్లిన‌ట్లు పాండ్యా, సూర్య‌ల పై బీసీసీఐ సెలెక్ష‌న్ క‌మిటీ వేటు వేసింది. ఈ ఇద్ద‌రిని త‌ప్పించింది తాజాగా టి20 సీరీస్ కోసం.

ఈ నేప‌థ్యంలో ముంబై ఇండియ‌న్స్ యాజ‌మాన్యం సుదీర్ఘంగా సూర్య కుమార్ యాద‌వ్ తో చ‌ర్చించిన‌ట్లు స‌మాచారం. త‌న‌ను జట్టుతోనే ఉండేలా ఒప్పించడంలో స‌క్సెస్ అయ్యింది. ఈ చర్చలు ఫ్రాంచైజీలో అతని దీర్ఘకాలిక పాత్ర, నాయకత్వ బాధ్యతలు, భవిష్యత్ ప్రణాళికలపై కేంద్రీకృతమయ్యాయి. ప్రస్తుతానికి, సూర్యకుమార్ యాదవ్ ముంబై ఇండియన్స్‌తో తన ప్రయాణాన్ని కొనసాగించనున్నారు. దీంతో అతని భవిష్యత్తుపై నెలకొన్న ఊహాగానాలకు తెరపడిందని భావిస్తున్నారు.