ఫెమా కేసులో ల‌లిత్ మోడీకి ఉప‌శ‌మ‌నం

ఇంగ్లండ్ : ఇండియ‌న్ ప్రిమీయ‌ర్ లీగ్ కు ఆద్యుడిగా భావించే ల‌లిత్ మోడీకి భారీ ఊర‌ట ల‌భించింది.
IPL 2009 FEMA కేసులో ట్రిబ్యునల్ నుండి త‌నకు ఉపశమనం ల‌భించ‌డం విశేషం. దీంతో త‌ను ఇండియాలో ప‌ర్య‌టించేందుకు వీలు క‌లుగుతుంది. దీని కార‌ణంగా భారత్‌లో పర్యటించేందుకు లలిత్ మోదీ ప్రణాళిక చేస్తున్న‌ట్లు స‌మాచారం. 2009లో దక్షిణాఫ్రికాలో జరిగిన IPL టోర్నమెంట్‌కు సంబంధించి చాలా కాలంగా నలుగుతున్న విదేశీ మారక ద్రవ్య (FEMA) ఉల్లంఘన కేసులో, అప్పిలేట్ ట్రిబ్యునల్ నుండి కీలకమైన న్యాయ పరమైన ఉపశమనం లభించడంతో మాజీ IPL చైర్మన్ లలిత్ మోదీ భారత్‌లో పర్యటించాలని యోచిస్తున్నారు.

ఈ తీర్పు తన 16 ఏళ్ల పోరాటానికి దక్కిన విజయం అని ఆయన పేర్కొన్నారు. సోషల్ మీడియాలో పోస్ట్ చేసిన ఒక వీడియో సందేశంలో, ఈ కేసులో తాను తీసుకున్న వైఖరి సరైనదేనని ట్రిబ్యునల్ తీర్పు ద్వారా నిజం నిరూపితమైందని మోదీ అన్నారు. ఈ తీర్పు పట్ల నేను చాలా సంతోషంగా ఉన్నాను. ఇది నిజంగా ఒక గొప్ప రోజు. నేను 16 ఏళ్లుగా పోరాడాను; మీడియాకు , అందరికీ నేను చెబుతూ వచ్చిన విషయాలే చివరికి నిజమని తేలాయి అని ల‌లిత్ మోదీ వ్యాఖ్యానించారు. భార‌త దేశంలో క్రికెట్ కు ఉన్న క్రేజ్ ను త‌ను గుర్తించాడు. ఆపై ఐపీఎల్ కు శ్రీ‌కారం చుట్టాడు. ఇది ఇప్పుడు వేల కోట్ల సామ్రాజ్యాన్ని సృష్టించేలా చేసింది.

  • Related Posts

    మ‌ద‌న్ లాల్ ఖురానా ఫౌండేష‌న్ అంబాసిడ‌ర్ గా శాంస‌న్

    న్యూఢిల్లీ : కేర‌ళ స్టార్ క్రికెట‌ర్ సంజు శాంస‌న్ మ‌ర్యాద పూర్వ‌కంగా ఢిల్లీ ముఖ్య‌మంత్రి రేఖా గుప్తాతో భేటీ అయ్యారు. త‌ను ఆఫ్గ‌నిస్తాన్ తో జ‌రిగిన కీల‌క‌మైన టి20 మ్యాచ్ ల‌లో వ‌రుస‌గా రెండు హాఫ్ సెంచ‌రీల‌తో చెల‌రేగి పోయాడు. త‌న…

    సంజు శాంస‌న్ పై గౌత‌మ్ గంభీర్ షాకింగ్ కామెంట్స్

    ముంబై : కేర‌ళ స్టార్ క్రికెట‌ర్ , టి20 వ‌ర‌ల్డ్ క‌ప్ హీరో సంజు శాంస‌న్ గురించి సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేశాడు భార‌త క్రికెట్ జ‌ట్టు హెడ్ కోచ్ గౌతం గంభీర్. త‌న గురించి శాంస‌న్ ఢిల్లీ వేదిక‌గా చేసిన కామెంట్స్…

    Leave a Reply

    Your email address will not be published. Required fields are marked *