టీటీడీ అన్న‌ప్ర‌సాదానికి రూ. 2,500 కోట్లు

Spread the love


ఫిక్స్ డ్ డిపాజిట్లు ఉన్నాయ‌న్న టీటీడీ

తిరుమ‌ల : తిరుమ‌ల తిరుప‌తి దేవ‌స్థానం పాల‌క మండ‌లి (టీటీడీ) ఆధ్వ‌ర్యంలో నిత్యం అన్నదానం కొన‌సాగుతోంది. ప్ర‌తి రోజూ స్వామి వారిని 75 వేల నుంచి 80 వేల మందికి పైగా ద‌ర్శించుకుంటున్నారు. ఇందుకు గాను దాత‌ల నుంచి పెద్ద ఎత్తున విరాళాలు సేక‌రిస్తున్నారు. ఇదిలా ఉండ‌గా టీటీడీ ఈ ఏడాది జ‌న‌వ‌రి 1 నుంచి మే 31 వ‌ర‌కు రికార్డు స్థాయిలో భ‌క్తుల‌కు శ్రీ‌వారి అన్న ప్ర‌సాదాన్ని అందించింది. ఇది టీటీడీ ఆల‌య చ‌రిత్ర‌లోనే ఓ రికార్డ్ కావ‌డం విశేషం. అన్న ప్ర‌సాదం కోసం టీటీడీ ప్ర‌త్యేకంగా ట్ర‌స్ట్ ను ఏర్పాటు చేసింది.

భక్తుల విరాళాలతో నిర్వహించబడుతున్న శ్రీ వేంకటేశ్వర అన్నప్రసాదం ట్రస్ట్ వద్ద ప్రస్తుతం రూ.2,500 కోట్లకు పైగా ఫిక్స్‌డ్ డిపాజిట్లు ఉన్నాయి. ఈ నిధుల ఆదాయంతో లక్షలాది మంది భక్తులకు నిత్యం ఉచితంగా నాణ్యమైన భోజనం అందిస్తూ టీటీడీ “అన్నదానం మహాదానం” అనే భారతీయ సనాతన సంప్రదాయాన్ని సమర్థవంతంగా కొనసాగిస్తోంది. శ్రీవారి సన్నిధిలో ఆకలితో వచ్చే ప్రతి భక్తునికి తృప్తికరమైన భోజనం అందించడం ద్వారా టీటీడీ అన్నప్రసాద సేవలు ప్రపంచ వ్యాప్తంగా ఆదర్శంగా నిలుస్తున్నాయి.

  • Related Posts

    గోవింద నామ స్మరణలతో మారుమోగిన కార్వేటి నగరం

    Spread the love

    Spread the loveసింహబల సమాన భక్తి బలానికి ప్రతీకగా వాహన సేవ తిరుపతి : కార్వేటినగరంలోని శ్రీ రుక్మిణి–సత్యభామ సమేత శ్రీ వేణు గోపాల స్వామి వారి వార్షిక బ్రహ్మోత్సవాలు అంగ‌రంగ వైభవోపేతంగా కొన‌సాగుతున్నాయి. ఉత్స‌వాల‌లో భాగంగా ఉదయం స్వామి వారు…

    జొజిల్లా ట‌న్నెల్ తో అమర్‌నాథ్ యాత్రకు ఓకే

    Spread the love

    Spread the loveక్లిష్ట భౌగోళిక పరిస్థితులు ప్ర‌త్యేకం జ‌మ్మూ కాశ్మీర్ : జోజిలా లో నిర్మిస్తున్న 13 కిలోమీటర్ల ప్రధాన టన్నెల్ మార్గంలో రాతి నిర్మాణాల స్వభావం 67 సార్లు మారింది. మంచు నుంచి అత్యంత బలహీనమైన రాతి పొరల వరకు…

    Leave a Reply

    Your email address will not be published. Required fields are marked *