తెలంగాణ ఇంట‌ర్ స‌ప్లిమెంట‌రీ రిజ‌ల్ట్స్ రిలీజ్

Spread the love

ప్ర‌క‌టించిన ఇంటర్మీడియ‌ట్ బోర్డు

హైద‌రాబాద్ : తెలంగాణ ఇంట‌ర్మీడియ‌ట్ బోర్డు (టీఐబీ) గురువారం కీల‌క ప్ర‌క‌ట‌న చేసింది. ఈ మేర‌కు ఇటీవ‌ల రాష్ట్రంలో నిర్వహించిన ఇంట‌ర్మీడియ‌ట్ సప్లిమెంట‌రీ ప‌రీక్ష‌ల‌కు సంబంధించి ఫ‌లితాల‌ను ప్ర‌క‌టించింది. ఉత్తీర్ణత శాతం మొదటి సంవత్సరంలో 68.84% ఉండ‌గా రెండవ సంవత్సరంలో 49.29%గా నమోదైన‌ట్లు తెలిపింది బోర్డు. మరోసారి బాలుర కంటే బాలికలే మెరుగైన ఫలితాలు సాధించారని స్ప‌ష్టం చేసింది. .

ఇదిలా ఉండ‌గా బాలికల ఉత్తీర్ణత శాతం మొదటి సంవత్సరంలో 76.10 శాతంగా, రెండవ సంవత్సరంలో 52.56 శాతంగా ఉంది. దీనికి భిన్నంగా, బాలురు మొదటి సంవత్సరంలో 62.57 శాతం , రెండవ సంవత్సరంలో 47.45 శాతం ఉత్తీర్ణతను నమోదు చేశారు. రాష్ట్ర వ్యాప్తంగా మొత్తం 3,98,459 మంది విద్యార్థులు ఈ పరీక్షలకు హాజరయ్యారు. మ‌రో వైపు ఈ ప‌రీక్ష‌ల్లో కూడా ఫెయిల్ అయిన వారికి మ‌రో ఛాన్స్ లేకుండా పోయింది. ఒక‌వేళ ఇంట‌ర్ ఫ‌ష్ట్ ఇయ‌ర్ లో గ‌నుక త‌ప్పి పోతే రెండో సంవ‌త్స‌రం ప‌రీక్ష‌లతో పాటు ఎగ్జామ్స్ రాయాల్సి ఉంటుంది.

  • Related Posts

    స్పోర్ట్స్ కోటా పేరుతో అన‌ర్హుల‌కు అంద‌లం

    Spread the love

    Spread the loveసంచ‌ల‌న ఆరోప‌ణ‌లు చేసిన మాజీ సీఎం జ‌గ‌న్ అమ‌రావ‌తి : ఏపీ మాజీ సీఎం జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేశారు. ఏపీ కూట‌మి స‌ర్కార్ ఆధ్వ‌ర్యంలో నిర్వ‌హించిన మెగా డీఎస్సీ-2026లో భారీ ఎత్తున అక్ర‌మాలు చోటు…

    ఏపీ, తెలంగాణ‌ రాష్ట్రాల్లో ఈడీ సోదాలు

    Spread the love

    Spread the loveహ‌వాలా, మ‌నీ లాండ‌రింగ్ ద్వారా నిధులు హైద‌రాబాద్ : కేంద్ర ద‌ర్యాప్తు సంస్థ ఎన్ ఫోర్స్మెంట్ డైరెక్ట‌రేట్ (ఈడీ) దూకుడు పెంచింది. ఏపీ మద్యం కుంభకోణం దర్యాప్తులో భాగంగా అటు ఆంధ్ర‌ప్ర‌దేశ్, తెలంగాణ‌ రాష్ట్రాల్లో ఈడీ సోదాలు చేప‌ట్టింది.…

    Leave a Reply

    Your email address will not be published. Required fields are marked *