ఏ పార్టీతో పెట్టుకోం స్వ‌తంత్రంగా పోటీ చేస్తాం

సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేసిన కేంద్ర మంత్రి షా

న్యూఢిల్లీ : కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ చంద్ర షా సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేశారు. ఆయ‌న మీడియాతో మాట్లాడారు. ఏ రాష్ట్రంలోనైనా స్వతంత్రంగా పోటీ చేసి అధికారంలోకి రావడమే మా లక్ష్యం అని ప్ర‌క‌టించారు. మొదటగా, తెలంగాణ, పంజాబ్‌లలో కూడా ఇదే ఉద్దేశంతో ముందుకు వెళ్తున్నాం అన్నారు. మేము దక్షిణ భారత రాష్ట్రాలపై దృష్టి సారించామని అమిత్ షా కీల‌క వ్యాఖ్య‌లు చేశారు. తెలంగాణలో బీజేపీతో పొత్తు పెట్టుకుంటే జనసేనకు ప్రయోజనం చేకూరుతుందనే ఆలోచనతో పవన్ కళ్యాణ్ అక్కడ రాజకీయాల్లోకి ప్రవేశించారు.

ఒకవేళ పొత్తు కుదరక పోతే ఇప్పటికి ఏపీలో గానీ, తెలంగాణలో గానీ జనసేన పరిస్థితి ఎలా ఉంటుందో పవన్ కళ్యాణ్ చాలాసార్లు చెప్పారు. ఏపీలో కూడా బీజేపీ ఒంటరిగా పోటీ చేస్తే, టీడీపీ, జనసేనలకు కష్టాలు తప్పవు. అంతే కాకుండా, ముఖ్యంగా జనసేన పరిస్థితి దారుణంగా ఉంటుంది (ఈ విషయాన్ని పవన్ కళ్యాణ్ స్వయంగా చాలాసార్లు చెప్పారన్నది గమనార్హం). ఇదిలా ఉండ‌గా తాజాగా అమిత్ షా చేసిన కామెంట్స్ క‌ల‌క‌లం రేపుతున్నాయి.

  • Related Posts

    వ్య‌వ‌సాయ రంగానికి బ‌డ్జెట్ లో ప్రాధాన్య‌త

    చెన్నై : త‌మిళ‌నాడు స‌ర్కార్ వ్య‌వ‌సాయ రంగానికి అత్య‌ధిక ప్రాధాన్య‌త ఇస్తోంది. ఇందులో భాగంగా సీఎం జోసెఫ్ విజ‌య్ చంద్ర‌శేఖ‌ర్ అధ్యక్ష‌త‌న కీల‌క స‌మావేశం జ‌ర‌గ‌నుంది. వరి, చెరకు పంటలకు కనీస మద్దతు ధర పెంపుపై ప్రధానంగా చర్చించ‌నున్నారు. ఇవాళ జోసెఫ్…

    రైతుల‌కు రూ. 300 కోట్ల వార్షిక బ‌కాయిల చెల్లింపు

    అమ‌రావ‌తి : ఏపీ పుర‌పాలిక శాఖ మంత్రి పొంగూరు నారాయ‌ణ కీల‌క ప్ర‌క‌ట‌న చేశారు. సీఎం అధ్య‌క్ష‌త‌న జ‌రిగిన సీఆర్డీఏ స‌మావేశంలో కీల‌క నిర్ణ‌యాలు తీసుకున్న‌ట్లు తెలిపారు. పలు ప్రాజెక్టుల‌కు ఆమోదం తెలిపార‌న్నారు. ఆలస్యం కారణంగా గృహ కొనుగోలుదారులు అదనపు ఆర్థిక…

    Leave a Reply

    Your email address will not be published. Required fields are marked *