స్టీల్ ప్లాంట్ ఘ‌ట‌న‌పై రాజ‌కీయం త‌గ‌దు

మంత్రి కొండ‌ప‌ల్లి శ్రీ‌నివాస్ షాకింగ్ కామెంట్స్

విశాఖ‌పట్నం : విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రమాద ఘటన దేశ వ్యాప్తంగా సంచ‌ల‌నం క‌లిగించింది. ఈ దుర్ఘ‌ట‌నలో 9 మంది ప్రాణాలు కోల్పోయారు. టీడీపీ కేంద్ర కార్యాలయంలో మంత్రి కొండపల్లి శ్రీనివాస్ మీడియా సమావేశం నిర్వ‌హించారు. విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రమాదంలోనూ రాజకీయం చేయడం దురదృష్టకరం అన్నారు. ప్ర‌మాదం జ‌రిగిన క్ష‌ణం నుంచి కూట‌మి ప్రభుత్వం బాధిత కుటుంబాలకు అండగా నిలిచింద‌ని చెప్పారు.

కేంద్ర మంత్రులు, మంత్రి నారా లోకేష్, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ స్వయంగా వెళ్లి బాధితులకు ధైర్యం చెప్పారు. ప్రభుత్వం తరఫున, శాశ్వత ఉద్యోగుల కుటుంబాలకు రూ.2 కోట్లు, కాంట్రాక్ట్ ఉద్యోగుల కుటుంబాలకు రూ.1 కోటి పరిహారం ప్రకటించాం అన్నారు.. మృతుల కుటుంబాలకు ఉద్యోగం, పిల్లలకు విద్య, క్వార్టర్స్ సౌకర్యం కల్పిస్తాం అని చెప్పారు కొండ‌ప‌ల్లి శ్రీ‌నివాస్. ఇలాంటి విషాదంలోనూ రాజకీయాలు చేయడం జగన్‌కే సాధ్యం అంటూ ఎద్దేవా చేశారు. స్టీల్ ప్లాంట్‌లో వేల ఉద్యోగాలు పోయాయని అబద్ధాలు చెప్ప‌డం దారుణ‌మ‌న్నారు.

  • Related Posts

    వ్య‌వ‌సాయ రంగానికి బ‌డ్జెట్ లో ప్రాధాన్య‌త

    చెన్నై : త‌మిళ‌నాడు స‌ర్కార్ వ్య‌వ‌సాయ రంగానికి అత్య‌ధిక ప్రాధాన్య‌త ఇస్తోంది. ఇందులో భాగంగా సీఎం జోసెఫ్ విజ‌య్ చంద్ర‌శేఖ‌ర్ అధ్యక్ష‌త‌న కీల‌క స‌మావేశం జ‌ర‌గ‌నుంది. వరి, చెరకు పంటలకు కనీస మద్దతు ధర పెంపుపై ప్రధానంగా చర్చించ‌నున్నారు. ఇవాళ జోసెఫ్…

    రైతుల‌కు రూ. 300 కోట్ల వార్షిక బ‌కాయిల చెల్లింపు

    అమ‌రావ‌తి : ఏపీ పుర‌పాలిక శాఖ మంత్రి పొంగూరు నారాయ‌ణ కీల‌క ప్ర‌క‌ట‌న చేశారు. సీఎం అధ్య‌క్ష‌త‌న జ‌రిగిన సీఆర్డీఏ స‌మావేశంలో కీల‌క నిర్ణ‌యాలు తీసుకున్న‌ట్లు తెలిపారు. పలు ప్రాజెక్టుల‌కు ఆమోదం తెలిపార‌న్నారు. ఆలస్యం కారణంగా గృహ కొనుగోలుదారులు అదనపు ఆర్థిక…

    Leave a Reply

    Your email address will not be published. Required fields are marked *