తాడిపత్రిలో జేసీ ప్రభాకర్ రెడ్డి హల్ చల్
పోలీస్ స్టేషన్ వద్ద స్నానం చేసిన నేత
అనంతపురం జిల్లా : తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకుడు జేసీ ప్రభాకర్ రెడ్డి సంచలనంగా మారారు. ఆయన తాడిపత్రిలో హల్ చల్ చేశారు. పోలీసుల పనితీరుపై ఆగ్రహం వ్యక్తం చేశారు. వైఎస్సార్‌సీపీ మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డిపై కేసులు నమోదు చేయాలని డిమాండ్ చేశారు. ఇదిలా ఉండగా తాడిపత్రిలో స్వేచ్ఛగా తిరిగేందుకు మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డికి హైకోర్టు అనుమతి ఇచ్చింది.పెద్దారెడ్డి అరాచకాలకు పాల్పడ్డారని ఆరోపిస్తూ, కేసులు నమోదు చేయాలని తన అనుచరులతో ఫిర్యాదులు చేయించారు జేసీ ప్రభాకర్ రెడ్డి.
ఆ ఫిర్యాదుల ఆధారంగా కేసులు నమోదు చేయాలని డిమాండ్ చేస్తూ తాడిపత్రి పోలీస్ స్టేషన్ వద్ద హల్చల్ చేశారు. ఆపై రోడ్డు పక్కన స్నానం చేసి పోలీసులపై ఆరోపణలు చేశారు. వారు కావాలనే పెద్దారెడ్డిపై కేసులు నమోదు చేయడం లేదని ఆరోపించారు జేసీ ప్రభాకర్ రెడ్డి. దీంతో గత్యంతరం లేక పోలీసులు ఒత్తిడిని తట్టుకోలేక మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డిపై కేసు నమోదు చేశారు.